AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asian Games 2023: చైనా కుటిల బుద్ధి.. ‘గోల్డ్‌’ మిస్‌ అయిన ఆంధ్రా అమ్మాయి.. సిల్వర్‌తో సరిపెట్టుకున్న జ్యోతి

ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి యర్రాజి రజత పతకం సాధించింది. స్వర్ణ పతకమే లక్ష్యంగా రేసులోకి బరిలోకి దిగిన ఈ ఆంధ్రా అమ్మాయి చైనా కుయుక్తులకు బలైపోయింది. వివరాల్లోకి వెళితే.. ఈ పోటీలో చైనా రేసర్ యానివు గన్ షాట్ (స్టార్టింగ్ షాట్)కు ముందే పరుగు ప్రారంభించింది. దీంంతో ఆమె పక్కనే ఉన్న జ్యోతి యార్రాజీ సైతం రేస్‌ అధికారికంగా ప్రారంభమైందని అనుకుని పరిగెత్తడం మొదలుపెట్టింది.

Asian Games 2023: చైనా కుటిల బుద్ధి.. 'గోల్డ్‌' మిస్‌ అయిన ఆంధ్రా అమ్మాయి.. సిల్వర్‌తో సరిపెట్టుకున్న జ్యోతి
Jyothi Yarraji
Basha Shek
|

Updated on: Oct 02, 2023 | 5:55 AM

Share

ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి యర్రాజి రజత పతకం సాధించింది. స్వర్ణ పతకమే లక్ష్యంగా రేసులోకి బరిలోకి దిగిన ఈ ఆంధ్రా అమ్మాయి చైనా కుయుక్తులకు బలైపోయింది. వివరాల్లోకి వెళితే.. ఈ పోటీలో చైనా రేసర్ యానివు గన్ షాట్ (స్టార్టింగ్ షాట్)కు ముందే పరుగు ప్రారంభించింది. దీంంతో ఆమె పక్కనే ఉన్న జ్యోతి యార్రాజీ సైతం రేస్‌ అధికారికంగా ప్రారంభమైందని అనుకుని పరిగెత్తడం మొదలుపెట్టింది. దీంతో రేస్‌ పూర్తయిన అనంతరం అంపైర్లు పలు మార్లు రేస్‌ ఫుటేజ్‌లను పరిశీలించి చైనా రన్నర్‌ను అనర్హురాలిగా ప్రకటించారు. అదే సమయంలో జ్యోతి ఉద్దశపూర్వకంగా ఈ తప్పిదం చేయలేదని నిర్ధారింంచారు. దీంతో ఆమెకు రజతం ప్రకటించారు నిర్వాహకులు. అయితే ఒక చైనా అథ్లెట్‌ చేసిన తప్పిదం కారణంగా మన ఆంధ్రా అమ్మాయి ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో బంగారు పతకం గెలిచే సువర్ణావకాశాన్ని కోల్పోయింది. అయితేనేం. హర్డిల్స్ పోటీల్లో పతకం సాధించిన భారతదేశపు తొలి మహిళా అథ్లెట్‌గా రికార్డు సృష్టించింది.

కాగా మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రేసుపై భారత అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇందుకు ప్రధాన కారణం జ్యోతి యర్రాజీనే. ఈ రేసులు ఆమె కచ్చితంగా బంగారు పతకం తెస్తుందని భావించారు. అయితే రేసు ప్రారంభంలోనే పెద్ద వివాదం చెలరేగింది. అథ్లెట్లందరూ రేసు కోసం తమ మార్క్‌లో ఉండగా.. గన్‌షాట్‌కు ముందే ముందే, చైనా రేసర్ యాని వు పరుగు ప్రారంభించింది. ఆమెను చూసి పక్కనే ఉన్న జ్యోతి కూడా పొరపాటు పడి జ్యోతి కూడా పరుగు ప్రారంభించింది. దీనిని అథ్లెటిక్స్‌లో ఫాల్స్ స్టార్ట్ అంటారు . అలా చేయడం వల్ల సదరు అథ్లెట్లను రేస్‌ నుంచి తప్పిస్తారు. ఈ రేస్‌లోనూ అధికారులు వెంటనే ఇద్దరు రేసర్లను అనర్హులుగా ప్రకటించారు. అయితే ఇద్దరు అథ్లెట్లు నిరసనకు దిగారు. ఆ సమయంలో అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలోని అథ్లెట్స్ కమీషన్ హెడ్, వెటరన్ లాంగ్ జంపర్ అంజు బాబీ జార్జ్ కూడా అక్కడే ఉన్నారు. జ్యోతికి మద్దతుగా మాట్లాడారు. దీంతో మ్యాచ్‌ నిర్వాహకులు రీప్లేలు చూసి యానివు మొదట పరుగు ప్రారంభించినట్లు తేల్చారు. వెంటనే ఆమెను అనర్హురాలిగా ప్రకటించారు. అదే సమయంలో జ్యోతి ఉద్దేశపూర్వకంగా ఎలాంటి తప్పు చేయలేదని నిర్ధారించారు. దీంంతో రేసులో మూడోస్థానంలో నిలిచిన ఆమెకు రజత పతకం అందించారు.

ఇవి కూడా చదవండి

రజతంతో సరి..

కుటిల బుద్ధిని చాటుకున్న చైనా అమ్మాయి..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో