Asian Games 2023: అదరగొట్టిన ‘బాహుబలి’.. షాట్‌పుట్‌లో భారత్‌కు స్వర్ణం.. ఇప్పటివరకు మొత్తం ఎన్ని పతకాలంటే?
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు. ఆదివారం జరిగిన షాట్‌పుట్ ఈవెంట్‌లో భారత బాహుబలి తేజిందర్‌పాల్ సింగ్ తూర్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు . దీంతో ఈ ప్రతిష్ఠాత్మక క్రీడల్లో భారత్ స్వర్ణాల సంఖ్య 13కి చేరింది. ఈ మ్యాచ్‌లో తేజిందర్‌కు తొలుత ఎదురుదెబ్బ తగిలినా ఆ తర్వాత ఘనంగా పునరాగమనం చేశాడు

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు. ఆదివారం జరిగిన షాట్‌పుట్ ఈవెంట్‌లో భారత బాహుబలి తేజిందర్‌పాల్ సింగ్ తూర్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు . దీంతో ఈ ప్రతిష్ఠాత్మక క్రీడల్లో భారత్ స్వర్ణాల సంఖ్య 13కి చేరింది. ఈ మ్యాచ్‌లో తేజిందర్‌కు తొలుత ఎదురుదెబ్బ తగిలినా ఆ తర్వాత ఘనంగా పునరాగమనం చేశాడు. స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని మువ్వన్నెల జెండాను రెపరెపలాడించాడు. తేజిందర్‌పాల్ సింగ్ టూర్ 20.36 మీటర్లు విసిరి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మరోవైపు, అథ్లెటిక్స్‌లో 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో అవినాష్ సాబ్లే భారత్‌కు బంగారు పతకాన్ని అందించాడు. ఈ పతకం చారిత్రాత్మకమైనది కాబట్టి ప్రత్యేకం. ఎందుకంటే ఆసియా క్రీడల్లో భారత్ ఇంతకు ముందు ఈ ఈవెంట్‌లో స్వర్ణం సాధించలేదు. ఈసారి అవినాష్ 8:19:53 నిమిషాల్లో రేసును పూర్తి చేసి మొదటి స్థానంలో నిలిచాడు.
ఇక 1500 మీటర్ల పరుగులో భారత అథ్లెట్లు కూడా మూడు పతకాలు సాధించారు. మహిళల 1500 మీటర్ల రేసులో హర్మిలన్ బెయిన్స్ రెండో స్థానంలో నిలిచింది. ఈ రేసును 4:05.39 నిమిషాల్లో పూర్తి చేసి రజత పతకాన్ని కైవసం చేసుకుందామె. ఈ రేసులో బహ్రెయిన్‌కు చెందిన విన్‌ఫ్రెడ్ యావీ ప్రథమ స్థానంలో నిలిచింది. అదే దేశానికి చెందిన మార్టా యోటా మూడో స్థానంలో నిలిచింది. ఇక పురుషుల విభాగంలో అజయ్ కుమార్ సరోజ్ రజత పతకం సాధించగా, జిన్సన్ జాన్సన్ కాంస్య పతకాన్ని సాధించాడు. మొదటి స్థానం ఖతార్‌కు చెందిన మహ్మద్ అల్గార్నీకి దక్కింది.
బాహుబలి తేజిందర్ సింగ్ తూర్..
View this post on Instagram
హర్మిలన్ బెయిన్స్ కు రజతం..
View this post on Instagram
ప్రస్తుతం ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. భారత అథ్లెట్లు ఇప్పటి వరకు 13 బంగారు పతకాలు, 21 రజతాలు, 19కాంస్య పతకాలు సాధించారు. దీంతో మొత్తం 43 పతకాలతో నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక 120 స్వర్ణాలు, 71 రజతాలు, 37 కాంస్య పతకాలతో ఆతిథ్య దేశం చైనా (రిపబ్లిక్ ఆఫ్ చైనా) పతకాల పట్టికలో మొత్తం 228 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది.
నాలుగో స్థానంలో భారత్:
Eight days into the #19thAsianGames, and the medal count speaks volumes! 🥇🥈🥉
Let’s peek at the NOCs journey so far, shall we? 👀#AsianGames #AsianGames2023 #Hangzhou #Hangzhou2022 #SaluteTheSpirit pic.twitter.com/gp43HZlH8Z
— Olympic Council of Asia (@AsianGamesOCA) October 1, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..