Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup 2023: భారత్‌పై గెలిచేందుకు ఆసీస్ మాస్టర్‌ ప్లాన్‌.. కంగారూలకు షాక్‌ ఇచ్చిన ‘డూప్లికేట్‌ అశ్విన్‌’

ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌ ప్రారంభానికి ఇంకా రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే వార్మప్‌ మ్యాచ్‌లు ప్రారంభం కాగా.. అక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్‌తో ప్రపంచకప్‌ అసలు సమరం ఆరంభం కానుంది. ఈ మెగా క్రికెట్‌ టోర్నీలో భాగంగా అక్టోబర్ 8న ఆస్ట్రేలియా, భారత్ జట్లు తలపడనున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఈ హై ఓల్టేజ్‌ మ్యాచ్‌ జరగనుంది. కాగా ఈ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టు టీమిండియాపై గెలిచేందుకు మాస్టర్‌ ప్లాన్‌ను వేసింది.

World Cup 2023: భారత్‌పై గెలిచేందుకు ఆసీస్ మాస్టర్‌ ప్లాన్‌.. కంగారూలకు షాక్‌ ఇచ్చిన 'డూప్లికేట్‌ అశ్విన్‌'
Mahesh Pithiya, Ravichandran Ashwin
Follow us
Basha Shek

|

Updated on: Oct 02, 2023 | 6:45 AM

ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌ ప్రారంభానికి ఇంకా రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే వార్మప్‌ మ్యాచ్‌లు ప్రారంభం కాగా.. అక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్‌తో ప్రపంచకప్‌ అసలు సమరం ఆరంభం కానుంది. ఈ మెగా క్రికెట్‌ టోర్నీలో భాగంగా అక్టోబర్ 8న ఆస్ట్రేలియా, భారత్ జట్లు తలపడనున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఈ హై ఓల్టేజ్‌ మ్యాచ్‌ జరగనుంది. కాగా ఈ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టు టీమిండియాపై గెలిచేందుకు మాస్టర్‌ ప్లాన్‌ను వేసింది. అయితే భారత యువ స్పిన్నర్ మహేశ్ పిథియా కంగారూల ప్రీప్లాన్‌పై చల్లటి నీళ్లు చల్లాడు. వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు, ఆస్ట్రేలియన్ జట్టు మహేష్ పిథియాను నెట్ బౌలర్‌గా తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే మహేష్ బౌలింగ్ స్టైల్ అచ్చం అశ్విన్ తరహాలోనే ఉంటుంది. అందుకే గతసారి భారత్‌లో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా ఆస్ట్రేలియా జట్టు నెట్ సెషన్స్‌లో మహేష్ పిథియా బౌలింగ్‌తోనే నెట్‌ ప్రాక్టీస్‌ చేసింది ఆసీస్‌ జట్టు. ఈ క్రమంలో ప్రపంచకప్‌లో అశ్విన్ ఆఫ్ స్పిన్‌ను ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా బ్యాటర్లు మహేష్ పిథియాతో హెల్ప్‌ తీసుకుందామనుకున్నారు. అందుకే ప్రపంచకప్‌కు ముందే బరోడా యంగ్ స్పిన్నర్‌ను పిలిపించుకునేందుకు ఆసీస్ జట్టు సిద్ధమైంది. అయితే ఆస్ట్రేలియా జట్టు ఇచ్చిన ఆఫర్‌ను మహేష్ ఫిథియా సున్నితంగా తిరస్కరించాడు. కాగా 21 ఏళ్ల మహేష్ పిథియా అశ్విన్‌ను తన రోల్ మోడల్‌గా భావిస్తాడు. ఇప్పుడు భారత బౌలర్‌పై వ్యూహరచన చేసేందుకు మళ్లీ ఫిథియాకు వెళ్లాలని నిర్ణయించుకున్న ఆస్ట్రేలియా జట్టుకు నిరాశే ఎదురైంది.

దీని గురించి మహేష్ ఫిథియా మాట్లాడుతూ’ ఇది ఒక గొప్ప అవకాశం అని నాకు తెలుసు. ఎందుకంటే జాతీయ జట్టు బ్యాటర్లకు బౌలింగ్ చేయడం మంచి అనుభవాన్ని ఇస్తుంది. అయితే ఈ దేశవాళీ టోర్నీలో బరోడా తరఫున ఆడాలని నిర్ణయించుకున్నాను. దీంతో ఆస్ట్రేలియా జట్టు ఆఫర్‌ను తిరస్కరించాను’ అని చెప్పుకొచ్చాడు. మహేష్ పితియా తీసుకున్న ఈ నిర్ణయం టీమ్ ఇండియాకు ప్లస్ పాయింట్ కావచ్చు. ఎందుకంటే చెన్నైలోని చెపాక్ మైదానంలో భారత జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఈ మ్యాచ్ కు ముందే భారత్ సీనియర్ స్పిన్నర్ పై వ్యూహరచన చేయాలని ఆస్ట్రేలియా ప్లాన్ చేసింది. కాగా, ఆసీస్ ఆఫర్‌ను తిరస్కరించి భారత యువ స్పిన్నర్ పెద్ద షాక్ ఇచ్చాడు.

వన్డే ప్రపంచ కప్‌లో పాల్గొనే భారత్, ఆస్ట్రేలియా జట్లు:

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.

ఇవి కూడా చదవండి

ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, కెమెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుషాగ్నే, మిచ్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..