Student Suicide: విజయవాడ కాలేజ్ హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో పేరెంట్స్ గురించి..

అనంతపురం నగరానికి చెందిన ఓ ఇంటర్ విద్యార్థిని కృష్ణా జిల్లాలోని శ్రీచైతన్య కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన విషాదాన్ని నింపింది. అనంతపురం నగరానికి చెందిన లాస్య శ్రీ అనే విద్యార్థిని

Student Suicide: విజయవాడ కాలేజ్ హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో పేరెంట్స్ గురించి..
Student Suicide
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 12, 2021 | 5:15 PM

అనంతపురం నగరానికి చెందిన ఓ ఇంటర్ విద్యార్థిని కృష్ణా జిల్లాలోని శ్రీచైతన్య కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన విషాదాన్ని నింపింది. అనంతపురం నగరానికి చెందిన లాస్య శ్రీ అనే విద్యార్థిని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. డాక్టర్ కావాలనే ఉద్దేశంతో లాస్య బైపీసీలో చేరింది. స్థానికంగా ఫ్యాకల్టీ సరిగా లేకపోవడంతో ఆమె కృష్ణాజిల్లాలోని కంకిపాడు పోరంకి బ్రాంచ్ శ్రీ చైతన్య లో జాయిన్ అయింది. అయితే గత ఐదు రోజులుగా కరోనా కారణంగా విద్యార్థులు కళాశాల నుంచి వెళ్లిపోతున్నారని తాను కూడా ఇంటికి వస్తానని తల్లిదండ్రులతో చెప్పింది. అయితే లాస్య తండ్రి ఆదివారం వచ్చి తీసుకెళ్తానని చెప్పారు. ఇంతలో మీ కూతురు ఆరోగ్యం సరిగాలేదని.. సీరియస్ గా ఉందంటూ తల్లిదండ్రులకు కళాశాల నుండి ఫోన్ వచ్చింది. దీంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు హుటాహుటిన విజయవాడ చెరుకున్నారు. అయితే అప్పటికే లాస్య మృతి చెందిందని చెప్పారు. లాస్య కళాశాలలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోయిందని కళాశాల యాజమాన్యం చెబుతోంది. పోస్టుమార్టం అనంతరం లాస్య మృతదేహం ఇవాళ అనంతపురం చేరుకుంది. లాస్య మృతితో కాలనీలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.

కాగా ఆత్మహత్యకు ముందు విద్యార్థిని లాస్యశ్రీ సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు గుర్తించారు.  హోంసిక్ వల్లే ఆత్మహత్యకు‌ పాల్పడినట్టు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించారు.  జనవరి 3వ తేదీన అనంతపురం నుంచి‌ వచ్చిన లాస్యశ్రీ చైతన్య కాలేజ్ లో జాయిన్ అయ్యింది. క్యాంపస్ వాతావరణం నచ్చలేదని, తనకు ఉండాలని లేదని పలుసార్లు తల్లిదండ్రులకు ఫోన్లు చేసింది. అయితే  లాస్యశ్రీకి తండ్రి చలపతి నచ్చజెప్పారు. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడి గురైన విద్యార్థిణి మార్చి 10న సాయంత్రం 6 గంటలకు హాస్టల్ గదిలో ఉరి వేసుకుంది. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ లో తల్లిదండ్రులు తన గురించి పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఫోన్లు చేసినా పేరెంట్స్ లిఫ్ట్ చేయడం లేదని,  మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది.  విద్యార్థి మృతిపై కమిటీ ఏర్పాటే చేసిన ప్రభుత్వం.. లోతైన దర్యాప్తు జరపాలని ఆదేశించింది.

Also Read:

5వ భార్య భర్తకు మొదట ఫోర్న్ వీడియోలు చూపించింది.. ఆ తర్వాత కాళ్లు, చేతులు కుర్చీకి కట్టింది.. చివరికి..

పంజాగుట్ట ఫ్లైఓవర్ కింద అగ్నిప్రమాదం.. పిల్లర్లకు అంటుకున్న మంటలు.. దట్టంగా వ్యాపించిన పొగ

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..