AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR Vizag Steel comment : వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై మళ్లీ గళమెత్తిన కేటీఆర్, ఏపీ.. దేశంలో భాగం కాదా..! అని వ్యాఖ్య

KTR vizag Steel plant comment : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకించి ఉద్యమానికి మద్దతు పలకటాన్ని సమర్ధించుకున్నారు మంత్రి కేటీఆర్‌. ఏపీ దేశంలో భాగం కాదా అని ప్రశ్నించారు...

KTR Vizag Steel comment : వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై మళ్లీ గళమెత్తిన కేటీఆర్, ఏపీ..  దేశంలో భాగం కాదా..! అని వ్యాఖ్య
Venkata Narayana
|

Updated on: Mar 12, 2021 | 5:59 PM

Share

KTR vizag Steel plant comment : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకించి ఉద్యమానికి మద్దతు పలకటాన్ని సమర్ధించుకున్నారు మంత్రి కేటీఆర్‌. ఏపీ దేశంలో భాగం కాదా అని ప్రశ్నించారు. ఏపీకి కష్టమొచ్చిందని మనం నోరుమెదపకుంటే, రేపు మనకు కష్టమొస్తే ఎవరొస్తారని ప్రశ్నించారు కేటీఆర్‌. ఈరోజు విశాఖ స్టీల్‌ప్టాంట్‌ అమ్ముతున్నారని, రేపు సింగరేణి, బీహెచ్‌ఈఎల్‌ పైన పడతారన్నారు కేటీఆర్‌. పకోడీలు, బఠానీలు అమ్మేవారిని కూడా ఉద్యోగాలిచ్చినట్లుగా కేంద్రం చెప్పుకుంటోందని కౌంటర్‌ ఇచ్చారు కేటీఆర్‌. జాతీయవాదం గురించి మాట్లాడే బీజేపీ…తెలంగాణ కూడా ఈ జాతిలో భాగమని మరిచిపోతోందన్నారు కేటీఆర్‌. బీజేపీవన్నీ మత రాజకీయాలన్న కేటీఆర్‌…జాతీయ స్థాయి ఎన్నికలొస్తే కశ్మీర్‌, రాష్ట్రస్థాయి ఎన్నికలైతే భైంసా గుర్తుకొస్తాయన్నారు.

Read also : Kangana Ranaut : గాంధీని టార్గెట్‌ చేసిన కంగనా, భార్య, సొంత బిడ్డలను వేధించినట్టు ఆరోపణలున్నాయని కామెంట్