Andhra Pradesh: అమానుషం.. ద్వారకా తిరుమలలో పసిబిడ్డ విక్రయం.. గుట్టురట్టు చేసిన పోలీసులు..
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమలలో అమానుష ఘటన జరిగింది. ముక్కుపచ్చలారని పసిబిడ్డను రూ. 2లక్షలకు అమ్మకం పెట్టారు తల్లిదండ్రులు.
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమలలో అమానుష ఘటన జరిగింది. ముక్కుపచ్చలారని పసిబిడ్డను రూ. 2లక్షలకు అమ్మకం పెట్టారు తల్లిదండ్రులు. స్థానికుల సమచారంతో రంగంలోకి దిగిన పోలీసులు పసిబిడ్డ విక్రయాన్ని గుట్టు రట్టు చేశారు. పసిబిడ్డతో పాటు తల్లిదండ్రులను ద్వారకా తిరుమల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజమండ్రికి చెందిన పసిబిడ్డ తల్లిదండ్రులు.. భీమవరానికి చెందిన ఓ వ్యక్తితో 2లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకున్నారు. అతనికి అప్పజెప్పేందుకు గత 20రోజులుగా ద్వారకా తిరుమలలో స్టే చేస్తున్నారు. ఈ క్రమంలో పసిబిడ్డ విక్రయం విషయం స్థానికుల చెవిన పడడంతో వారు అలర్ట్ అయ్యారు.
వెంటనే పోలీసులకు సమచారం ఇచ్చారు. పక్కా సమచారంతో పసిబిడ్డను విక్రయానికి పెట్టిన తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో పసిబిడ్డను విక్రయానికి పెట్టిన విషయం.. దానికి సంబంధించిన వివరాలను పోలీసులు రాబట్టారు. దీని గురించి తెలుసుకున్న కొనుగోలు చేసే వ్యక్తులు పరార్ అయినట్లు పోలీసులు చెప్పారు.
పసిబిడ్డ కొనేందుకు వచ్చిన వ్యక్తులు ఎవరు.. దీని వెనుక ఏదైనా ముఠా ప్రమేయం ఉందా..? అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ద్వారకా తిరుమల శేషాచల కొండపై పసిబిడ్డ విక్రయం వెలుగురావడంతో ఒక్కసారిగా కలకలం రేపింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..