Andhra Pradesh: ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. ఇకపై వారికి కూడా ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్
సెక్రటేరియట్‌లోని సీఎం ఆఫీస్, సెక్రటేరియట్, హెచ్ఓడీ కార్యాలయాల్లోని ఆఫీసర్లకు ఫోన్‌లలో ఫేస్ రికగ్నేషన్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 25 నుంచి యాప్ ద్వారా ఫేషియల్ అటెండెన్స్ నమోదు చేయాలని అందులో పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగుల హాజరు నమోదు కోసం ఫేస్ రికగ్నేషన్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అమరావతిలోని సెక్రటేరియట్‌లో విధులు నిర్వహించే ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా ఫేస్ రికగ్నేషన్ యాప్ అటెండెన్స్ అమలు చేయాలని సర్కారు నిర్ణయం తీసుకుంటుంది. ఈమేరకు సెక్రటేరియట్‌లోని సీఎం ఆఫీస్, సెక్రటేరియట్, హెచ్ఓడీ కార్యాలయాల్లోని ఆఫీసర్లకు ఫోన్‌లలో ఫేస్ రికగ్నేషన్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 25 నుంచి యాప్ ద్వారా ఫేషియల్ అటెండెన్స్ నమోదు చేయాలని అందులో పేర్కొంది. ఐదు రోజులపాటు ట్రయిల్ రన్ నిర్వహించి వచ్చే నెల ఒకటి నుంచి ఆయా ఉద్యోగులకు పూర్తి స్థాయిలో ఫేస్ యాప్ ద్వారా హాజరు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా ఐఏఎస్‌లను గాడిలో పెట్టేందుకు టీచర్ల తరహాలోనే వీరికి ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ అమలు చేస్తున్నట్లు సర్కార్ తెలిపింది. సీఎంఓలో విధులు నిర్వహించే వాళ్లు.. సీఎం కార్యాలయం నుంచి ఫేస్ రికగ్నేషన్ యాప్ ద్వారా అటెండెన్స్ వేయాలని స్పష్టం చేసింది సర్కార్. ఫేస్ రికగ్నేషన్ యాప్ ద్వారా అటెండెన్స్ వేయకుంటే మెమోలు జారీ చేస్తామని ఉన్నతాధికారులకు హెచ్చరించింది. గెజిటెడ్ అధికారులకు కూడా ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..