Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు, పవన్‌ల గేమ్ ప్లాన్.. ఏపీలో ‘ముందస్తు’ ఎన్నికలపై తేల్చేసిన సజ్జల
ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ జరుగుతోన్న ప్రచారంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. రాష్ట్రంలో ముందస్తు ముచ్చటే లేదని ఆయనే తేల్చిచెప్పేశారు. 'మాకు ముందస్తుకు పోవాలనే ఆలోచన లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ జరుగుతోన్న ప్రచారంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. రాష్ట్రంలో ముందస్తు ముచ్చటే లేదని ఆయనే తేల్చిచెప్పేశారు. ‘మాకు ముందస్తుకు పోవాలనే ఆలోచన లేదు. ఇదంతా ప్రత్యర్థులు చేసే హడావిడి తప్ప మరేం కాదు. ప్రజలు ఇచ్చిన 5 ఏళ్ల పాలన పూర్తి చేశాకే వెళతాం. రాష్ర్ట ప్రజానీకం అశీర్వచనాలతోనే ఎన్నికలకు రెడీ అవుతాం. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పవన్ కల్యాణ్ ముందస్తు కావాలని కోరుకుంటున్నారు. మాకు మాత్రం పూర్తి సమయం అవసరం. సీట్లు, ఓట్ల కోసం చంద్రబాబు, పవన్ ఆడుతున్న గేమ్ ప్లాన్‌లో ఇది భాగం. ముందస్తు అంటే మా దగ్గర నుంచే వస్తుంది. పవన్ ను ఒప్పించుకోవడానికి చంద్రబాబు ముందస్తు ప్రచారం. దీనికి తగ్గట్టుగానే కొన్ని పార్టీలు కొన్ని మీడియా సంస్థలు చేసే హడావిడి చేస్తున్నాయి. ఐదేళ్లు పాటు ఆఖరి రోజు వరకూ పూర్తిగా వినియోగించుకుంటాం. వైసీపీకి పూర్తి సమయం అవసరం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి’ అని సజ్జల పేర్కొన్నారు.
ఇక సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై స్పందించారు సజ్జల ‘ జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా నిర్మాణాత్మకంగా వెళ్తున్నారు. సానుకూల ఫలితాలు వస్తున్నాయి. జగన్ పాజిటివ్ ఓట్ ను మాత్రమే నమ్ముకున్నారు. అమరావతిలో ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. రాష్ట్ర వాటాలతోనే పనులు జరుగుతాయి. రాజధాని ప్రాంతంలో ఇళ్ళు కట్టవద్దు అని కోర్ట్ చెప్పలేదు’ అని సజ్జల పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.