AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Purandeswari: ఏపీలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తా.. ఢిల్లీలో జేపీ నడ్డాను కలిసిన పురంధేశ్వరి

ఏపీ బీజేపీ నూతన అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. గురువారం ఢిల్లీ వెళ్లిన ఆమె నడ్డా నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై సుమారు 45 నిమిషాల పాటు చర్చించారు.

Purandeswari: ఏపీలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తా.. ఢిల్లీలో జేపీ నడ్డాను కలిసిన పురంధేశ్వరి
Purandeswari, Jp Nadda
Basha Shek
|

Updated on: Jul 06, 2023 | 3:46 PM

Share

ఏపీ బీజేపీ నూతన అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. గురువారం ఢిల్లీ వెళ్లిన ఆమె నడ్డా నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై సుమారు 45 నిమిషాల పాటు చర్చించారు. అనంతరం తన పై నమ్మకం ఉంచినందుకు నడ్డాకి కృతజ్ఞతలు తెలియజేశానంటూ ట్వీట్‌ చేశారు. అలాగే ఏపీలో బీజేపీ బలోపేతం కోసం కృషి చేస్తానని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశాను. నాపై ఉంచిన నమ్మకానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశాను. నిబద్ధతో పనిచేసి ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తాను. ఏపీ, ఆంధ్రుల హక్కులు కాపాడేందుకు కృషి చేస్తాను’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు పురంధేశ్వరి. కాగా సోము వీర్రాజు స్థానంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి నియమిస్తూ బీజేపీ అధిష్టానం మంగళవారం (జూన్‌ 4) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

కాగా ఏపీలో గత మూడేళ్లుగా సోము వీర్రాజు ఏపీ బీజేపీ చీఫ్‌గా ఉన్నారు. అయితే ఆయనపై పలు ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరించడం లేదన్న ఆరోపణలు వచ్చాయి. అలాగే వీర్రాజు హయాంలోనే కన్నా లక్ష్మీ నారాయణ వంటి కీలక నాయకులు పార్టీని వీడారు. ఈక్రమంలోనే సోము వీర్రాజు స్థానంలో పురంధేశ్వరని బీజేపీ అధ్యక్షురాలిగా నియమించింది బీజేపీ అధిష్ఠానం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?