ఖైరతాబాద్ మహాగణపతి దర్శనాలు ఎప్పటివరకు అంటే!
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన మహోత్సవానికి నగరం సిద్ధమవుతోంది. అనంత చతుర్దశి సందర్భంగా ఈ నెల 25న ఖైరతాబాద్ మహాగణపతితో పాటు నగరంలోని వేలాది గణేశ్ విగ్రహాలు నిమజ్జనానికి తరలనున్నాయి. భారీగా తరలివచ్చే భక్తులు, విగ్రహాలను దృష్టిలో పెట్టుకుని జీహెచ్‌ఎంసీ, పోలీసు శాఖతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రధానంగా హుస్సేన్‌సాగర్ వద్ద నిమజ్జన ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం అదనపు క్రేన్లను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు నిమజ్జన వేదికలను మరింత మెరుగుపరుస్తున్నారు. భారీ విగ్రహాల నిమజ్జనంలో ఆలస్యం జరగకుండా అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు చేస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
