AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shafali Verma: సంజు శాంసన్‌ను గుర్తు చేస్తున్న షెఫాలీ.. ఆసియా గేమ్స్‌లో దుమ్మురేపిన స్టార్ ఓపెనర్

Shafali Verma: ఆసియా గేమ్స్ 2026లో భారత మహిళల జట్టు గోల్డ్ మెడల్ సాధించడంలో షెఫాలీ వర్మ కీలక పాత్ర పోషించింది. బంగ్లాదేశ్‌పై సెమీఫైనల్లో అద్భుతమైన సెంచరీతో చరిత్ర సృష్టించిన షెఫాలీ, ఫైనల్లో శ్రీలంకపై 48 పరుగులతో మెరిసింది. క్వార్టర్ ఫైనల్లోనూ వేగంగా పరుగులు చేసింది. ఆమె దూకుడైన బ్యాటింగ్, సంజు శాంసన్ టీ20 ప్రపంచకప్‌లో చూపిన సూపర్ ఫామ్‌ను గుర్తు చేస్తోంది.

Shafali Verma: సంజు శాంసన్‌ను గుర్తు చేస్తున్న షెఫాలీ.. ఆసియా గేమ్స్‌లో దుమ్మురేపిన స్టార్ ఓపెనర్
Shafali Verma (1)
Rakesh
|

Updated on: Sep 22, 2026 | 5:58 PM

Share

Shafali Verma: భారత మహిళా క్రికెట్ జట్టు ఏషియన్ గేమ్స్ ఫైనల్ పోరులో శ్రీలంకను భారీ తేడాతో ఓడించి దేశానికి గోల్డ్ మెడల్‌ను సాధించిపెట్టింది. ఈ విజయంతో భారత క్రీడా ప్రపంచంలో సంబరాలు మిన్నంటాయి. ఈ టోర్నమెంట్‌లో భారత జట్టు విజయానికి ఓపెనర్ షెఫాలీ వర్మ చేసిన పరుగులే ప్రధానంగా నిలిచాయి. కేవలం ఫైనల్ మ్యాచ్‌లోనే కాకుండా, సెమీఫైనల్, క్వార్టర్ ఫైనల్స్ వంటి కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లలోనూ షెఫాలీ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను ఉతికిపారేశారు. ఆమె ప్రదర్శనను చూస్తుంటే ఇటీవల పురుషుల టీ20 ప్రపంచకప్‌లో స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ ప్రదర్శించిన అద్భుతమైన ఫామ్ అందరికీ గుర్తుకొస్తోంది.

గతంలో టీ20 ప్రపంచకప్‌లో సంజు శాంసన్ తొలి ఐదు మ్యాచ్‌లలో ఏకంగా 321 పరుగులు చేసి జట్టును విజయపథంలో నడిపించారు. సరిగ్గా అదే తరహాలో షెఫాలీ వర్మ కూడా తన చివరి ఐదు టీ20 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లలో అద్భుతమైన గణాంకాలను నమోదు చేశారు. ఈ ఐదు పెద్ద మ్యాచ్‌లలో కలిపి ఆమె మొత్తం 320 పరుగులు సాధించడం విశేషం. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. ఆసియా కప్ సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లతో మొదలైన ఆమె పరుగుల ప్రయాణం, ఏషియన్ గేమ్స్ వరకు కూడా ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా క్వార్టర్ ఫైనల్స్‌లో జపాన్‌పై కేవలం 15 బంతుల్లోనే 40 పరుగులు చేసి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు.

ఏషియన్ గేమ్స్ సెమీఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై షెఫాలీ వర్మ బ్యాట్‌తో చెలరేగిపోయారు. కేవలం 49 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ బాది, ఏషియన్ గేమ్స్ చరిత్రలో సెంచరీ సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డులకెక్కారు. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లోనూ కేవలం 29 బంతుల్లోనే 48 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. కెరీర్‌లో కొంతకాలం పాటు నిలకడలేమిని ఎదుర్కొన్న షెఫాలీ, సరిగ్గా సంజు శాంసన్ మాదిరిగానే అద్భుతమైన రీతిలో రీఎంట్రీ ఇచ్చి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నారు.

ఒకప్పుడు అద్బుత ప్రదర్శనల కారణంగా విమర్శలను ఎదుర్కొన్న ఆటగాళ్లు ఇప్పుడు బిగ్ స్టేజ్‌లపై తమ సత్తా చాటుతున్నారు. సంజు శాంసన్ పురుషుల క్రికెట్‌లో ఎలాగైతే ఒత్తిడిని అధిగమించి టీమిండియాకు ప్రపంచకప్ అందించడంలో కీలక పాత్ర పోషించారో, ఇప్పుడు షెఫాలీ వర్మ కూడా మహిళల క్రికెట్‌లో అదే మ్యాజిక్‌ను రిపీట్ చేశారు. ఈ ఇద్దరు ఆటగాళ్ల కెరీర్ గ్రాఫ్ దాదాపు ఒకేలా సాగడం విశేషం. పరుగుల వరద పారిస్తూ ప్రత్యర్థులకు సింహస్వప్నంగా మారిన షెఫాలీ వర్మ భవిష్యత్తులో మరిన్ని చారిత్రక రికార్డులు సృష్టించడం ఖాయమని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us