AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రయాణికులను నడిరోడ్డుపై దింపేసిన ఆర్టీసి డ్రైవర్.. టికెట్ తీసుకున్నాక ఇదేంటని యాత్రికుల ఆగ్రహం.. అసలేం జరిగిందంటే..?

Kadapa District: కడప నుంచి బద్వేల్‌కు ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్సును సిద్ధవటం సమీపంలో ఆర్టీసి డ్రైవర్ నిలిపివేసి ప్రయాణికులంతా కిందకు దిగాలని మీకు వేరే బస్ వస్తుంది, అందులో ఎక్కి బద్వేలుకు వెళ్ళాలని చెప్పాడు. దీంతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చకుండా మధ్యలోనే ఆపి వేరే బస్సు వస్తుంది, బస్సు దిగేయండి అనడంతో ప్రయాణికులు ఆగ్రహానికి..

ప్రయాణికులను నడిరోడ్డుపై దింపేసిన ఆర్టీసి డ్రైవర్.. టికెట్ తీసుకున్నాక ఇదేంటని యాత్రికుల ఆగ్రహం.. అసలేం జరిగిందంటే..?
RTC passenger Questioning Bus Driver
Sudhir Chappidi
| Edited By: శివలీల గోపి తుల్వా|

Updated on: Aug 21, 2023 | 6:30 AM

Share

కడప జిల్లా, ఆగస్టు 21: ప్రయాణికులను ఎక్కించుకున్న దగ్గర నుంచి వారి గమ్యస్థానాలకు సురక్షితంగా తీసుకువెళ్లాల్సిన ఆర్టీసీ బస్సు సిబ్బంది వారిని అద్దాంతరంగా నడిరోడ్డుపై దించేశారు. మధ్యలోనే దించేసింది కాక వేరే బస్సు వస్తుంది, అందులో ఎక్కేసి వెళ్లిపోండని చెప్పడంతో అందులో ప్రయాణిస్తున్న 22 మంది ప్రయాణికులు ఒక్క సారిగా షాక్ గురయ్యారు.. కడప జిల్లాలో జరిగిన ఈ సంఘటనపై ఆర్టీసీ ప్రయాణికులకు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ బస్ సిబ్బంది ఇలా ఎందుకు చేశారంటే.. కడప నుంచి బద్వేల్‌కు ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్సును సిద్ధవటం సమీపంలో ఆర్టీసి డ్రైవర్ నిలిపివేసి ప్రయాణికులంతా కిందకు దిగాలని మీకు వేరే బస్ వస్తుంది, అందులో ఎక్కి బద్వేలుకు వెళ్ళాలని చెప్పాడు. దీంతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చకుండా మధ్యలోనే ఆపి వేరే బస్సు వస్తుంది, బస్సు దిగేయండి అనడంతో ప్రయాణికులు ఆగ్రహానికి గురయ్యారు.

22 మంది ప్రయాణికులను అద్దాంతరంగా నడిరోడ్డుపై దించేయడంతో ఇందేంటని ప్రయాణికులు గట్టిగా ప్రశ్నించడంతో చిత్తూరుకు వెళ్లాల్సిన బస్సు బ్రేక్ డౌన్ అయిందని ఆ బస్సు ప్లేసులో ఈ బస్సును వెళ్ళమనిపై అధికారులు చెప్పారని ప్రయాణికులతో బస్ కండక్టర్ చెప్పినట్టు ప్రయాణికులు అంటున్నారు. బస్సులో 22 మంది ప్రయాణికులు టికెట్టు తీసుకున్న తర్వాత గమ్యస్థానాలు చేర్చకుండా మధ్యలో దింపటం ఏమిటంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సు చెడిపోవడం, లేదా ఇతర అత్యవసర పరిస్థితులలో మినహా ప్రయాణికులను మధ్యలో దింపకుండా చూడాల్సిన పరిస్థితిలలో.. వేరే బస్సు ఎక్కడో ఆగిపోయిందని ప్రయాణికులతో ఉన్న బస్సును మధ్యలో ఆపి ప్రయాణికులను నడిరోడ్డుపై దించేసి ఆ బస్సు కోసం ఈ బస్సును పంపడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు

బద్వేలుకు చేరుకోవడానికి మరో 35 కిలోమీటర్ల దూరం ఉండగానే ప్రయాణికులను అద్దాంతరంగా మధ్యలో దించేయడం ఏమిటని పూర్తిగా గమ్యస్థానాలకు చేర్చేందుకే టికెట్ కొట్టి మధ్యలో ఇలా దించడం ఆర్టీసీకి తగదని ప్రయాణికులు అంటున్నారు. వేరే బస్సు వచ్చేదాకా రోడ్డుపైనే వెయిట్ చేసి మళ్లీ ఆ బస్సు ఎక్కి బద్వేల్ కు చేరుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఎంత ప్రాధేయపడిన బస్సు డ్రైవర్ మాత్రం ప్రయాణికులను బద్వేల్ కు తీసుకురాలేదని ప్రయాణికులు అంటున్నారు. ఇలా చేస్తే ఆర్టీసీకి నష్టాలు తప్ప లాభాలు ఎక్కడి నుంచి వస్తాయి అని ప్రయాణికులను సురక్షితంగా తీసుకురాని ఆర్టీసీ బస్సులు ఎవరు ఎక్కుతారంటూ బస్సులో ప్రయాణించిన వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి