Kadapa: హైదరాబాద్ హైవేపై ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషయం..

Kadapa District: ఆగి ఉన్న లారీని వెనుకగా వచ్చిన కారు ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురు కుటుంబీకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అలాగే మిగిలిన ఇద్దరి పరిస్థితి కూడా మృత్యువుతో పోరాటంగా మారింది. కడప జిల్లాలో చెన్నూరు సమీపంలో ఆదివారం మధ్యాహ్నం సుమారు 12.45 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కడప నుంచి హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవే‌పై ఆంధ్రా స్పైస్ హోటల్‌కు కొద్ది దూరంలో..

Kadapa: హైదరాబాద్ హైవేపై ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషయం..
Accident Spot Images
Follow us
Sudhir Chappidi

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Aug 21, 2023 | 7:00 AM

కడప జిల్లా, ఆగస్టు 21: అతివేగమో, మధ్యాహ్న వేళ కావడంతో ముంచుకొచ్చిన నిద్రతో కారుని నడపడమో తెలియదు కానీ కనురెప్ప పాటలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆగి ఉన్న లారీని వెనుకగా వచ్చిన కారు ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురు కుటుంబీకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అలాగే మిగిలిన ఇద్దరి పరిస్థితి కూడా మృత్యువుతో పోరాటంగా మారింది. కడప జిల్లాలో చెన్నూరు సమీపంలో ఆదివారం మధ్యాహ్నం సుమారు 12.45 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కడప నుంచి హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవే‌పై ఆంధ్రా స్పైస్ హోటల్‌కు కొద్ది దూరంలో ఆగిఉన్న లారీని కారు ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో మృగ్గురు మృతి చెందారు.

ఇక ఈ ప్రమాదంలో కొండెటి కృష్ణ అనే అతను, అతని కొడుకు స్పాట్‌లోనే మృతి చెందగా కృష్ణ భార్యను కడప ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందింది. కృష్ణ కూతురు, అత్త ఇద్దరూ ఇప్పుడు అసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. అలాగే వారి పరిస్దితి విషమంగా ఉండటంతో వారిని కడప నుంచి విజయవాడకు తరలించారు. ప్రమాద స్థలంలోని స్థానికుల చెప్పిన వివరాలు ప్రకారం లారీ డ్రైవర్ హైవే పైన భోజనం తినేందుకు ఆపిన సమయంలో కడప వైపు నుంచి వస్తున్న కొండేటీ కృష్ణ కారు సడన్‌గా ఢీకొట్టిందని తెలిపారు. కారు అతివేగంతో వచ్చి ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో కారు ముందు భాగం అంతా నుజ్జు నుజ్దుగా మారిందని, డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి అతని వెనుక కూర్చున్న వ్యక్తి ఇద్దరూ అక్కడికి అక్కడే స్పాట్‌లో చనిపోయారని వివరించారు.

అయితే డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న మహిళను ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో చనిపోయిందని స్థానికులు చెప్పారు. వీరంతా హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. యాక్సిడెంట్ గురించి కొండేటి కృష్ణ కుటుంబ బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే కడప అసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న ఇద్దరినీ హుటాహుటీన విజయవాడ తరలించారు. ప్రమాదం జరిగిన సమయలో బాధితుల వద్ద చైతన్య కాళాశాలకు చెందిని విజిటర్ పాస్‌లు, వారి ఆధార్ కార్డులు లభించడంతో.. వాటి ఆధారంగా వీరు ఖైరతాబాద్‌కి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

కాగా, కారు అతివేగం కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో ఆ కుటుంబం చిన్నబిన్నమైపోయిందని, ఇలా అతివేగంతో ప్రయాణం ప్రమాదమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆలస్యం అయినా నిదానంగా ప్రయాణించడమే ప్రాణాలకు శ్రీరామ రక్ష అని సూచిస్తున్నారు.

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?