Andhra Pradesh: ఆ నాయకుడికి అనివార్యంగా మారిన గెలుపు.. అందరి చూపు ఆ నియోజకవర్గంపైనే
గన్నవరం లో ఇపుడు హాట్ హాట్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. వచ్చే 2024 ఎన్నిక వల్లభనేని వంశీ కి అత్యంత కీలకం కానుంది. వంశీ రాజకీయ జీవితంలోనే ఇపుడు ఇక్కడ నుంచి పోటీ చేయటం ఒక టర్నింగ్ పాయింట్ కానుంది. ఒకవిధంగా చెప్పాలంటే వంశీ కి గెలుపు అనివార్యం అయింది. 2014 ఎన్నిక ముందు వంశీ దాదాపు వైఎస్సార్సీపీలో చేరినట్టే అని అంత అనుకొన్నారు. విజయవాడ ఎన్నికల ప్రచార సమయం లో వంశీ నీ ఆలింగనం చేసుకున్నారు దృశ్యం చాలా మందికి గుర్తుండే వుంటుంది...
విజయవాడ, ఆగస్టు 20: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఎన్నికలకు ఇంకా ఏడాది ఉండగానే పొలిటికల్ పార్టీలు అస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. అటు అధికార పార్టీ వైసీపీ, ఇటు ప్రతిపక్ష పార్టీ టీడీపీ పోటాపోటీగా వ్యూహాలు రచించుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఓ వ్యక్తి చుట్టూ ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇంతకీ ఎవరా లీడర్.? ఆయనకు గెలుపు అంత అనివార్యంగా ఎందుకు మారింది.? లాంటి ఆసక్తికర విషయాలు తెలియాలంటే. ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
గన్నవరం లో ఇపుడు హాట్ హాట్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. వచ్చే 2024 ఎన్నిక వల్లభనేని వంశీ కి అత్యంత కీలకం కానుంది. వంశీ రాజకీయ జీవితంలోనే ఇపుడు ఇక్కడ నుంచి పోటీ చేయటం ఒక టర్నింగ్ పాయింట్ కానుంది. ఒకవిధంగా చెప్పాలంటే వంశీ కి గెలుపు అనివార్యం అయింది. 2014 ఎన్నిక ముందు వంశీ దాదాపు వైఎస్సార్సీపీలో చేరినట్టే అని అంత అనుకొన్నారు. విజయవాడ ఎన్నికల ప్రచార సమయం లో వంశీ నీ ఆలింగనం చేసుకున్నారు దృశ్యం చాలా మందికి గుర్తుండే వుంటుంది. వైఎస్సార్సీపీ వంశీ చేరిక లాంఛనమే అని అప్పట్లో అంతా అనుకొన్నారు. కానీ అప్పట్లో వంశీ వెనక్కి తగ్గారు. 2014 లో టీడీపీ టికెట్ పైనే పోటీ చేసి దుట్ట రామచంద్రారావుపై దాదాపు తొమ్మిది వేల ఓట్లతో గెలిచారు.
తిరిగి 2019 లో గన్నవరం సీట్‌ను ఎలాగైనా గెలవాలని వైఎస్సార్సీపీ గట్టి ప్రయత్నం చేసింది ఇందుకోసం అదే సామాజికవర్గంకు చెందిన యార్లగడ్డ వెంకటరావును బరిలోకి దింపింది. ఎన్నిక చాలా హోరా హోరీగా కొనసాగింది. ఎవరు గెలుస్తారో చివరి వరకు చెప్పలేని పరిస్థితి వచ్చింది ఓట్ల లెక్కింపు సమయంలో కూడా ఉత్కంఠకు దారి తీసింది ..838 ఓట్ల మెజారిటీతో వంశీ చివరికి గెలుపొందారు. అయితే టీడీపీ అధికారాన్ని కోల్పోయి వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో వంశీ తన సన్నిహితులైన కోడలి నాని , పేర్ని నాని సహాయంతో వైఎస్సార్సీపీ లోకి వచ్చారు. సీఎం జగన్ కూడా వంశీ కే ప్రాధాన్యత ఇచ్చారు. యార్లగడ్డ వెంకట్రావు వంశీ మధ్య తీవ్రంగా విభేదాలు వచ్చినపుడు వంశీ వైపే పార్టీ నిలబడింది.
ఇక విధిలేని పరిస్థితుల్లో యార్లగడ్డ పార్టీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది . ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్దన రావు కూడా టీడీపీలో చేరారు. వంశీ వైతిరేకులను ఒక తాటి పై తేవాలని ప్రయత్నం చేస్తుంది. చంద్ర బాబు, లోకేష్ కూడా వల్లభనేని వంశీ నీ గన్నవరం లో ఓడించాలని చాలా వ్యక్తిగతంగా తీసుకొన్నారు..ఇన్ని పరిస్థితుల మధ్య గన్నవరంలో గెలుపు వైఎస్సార్సీపీ కన్న వల్లభనేని వంశీ కే చాలా అవసరం. వంశీ రాజకీయ జీవితానికి కూడా ఇప్పుడు గెలుపు చాలా కీలకంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..