ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు.. నామినేషన్ ఉపసంహరించుకుంటారా..
ఏపీ, తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజు కావడంతో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. అనుచరులతో కలిసి ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్లు వేశారు. ఇక రేపటినుంచి నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈనెల 29 వరకు నామినేషన్లు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. కానీ పశ్చిమగోదావరి జిల్లా ఉండి టీడీపీలో రాజకీయ ఉక్కపోత మాత్రం అలాగే కంటిన్యూ అవుతోంది.
ఏపీ, తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజు కావడంతో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. అనుచరులతో కలిసి ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్లు వేశారు. ఇక రేపటినుంచి నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈనెల 29 వరకు నామినేషన్లు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. కానీ పశ్చిమగోదావరి జిల్లా ఉండి టీడీపీలో రాజకీయ ఉక్కపోత మాత్రం అలాగే కంటిన్యూ అవుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే శివరామరాజు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడంతో సీన్ మళ్లీ మొదటికొచ్చింది. టీడీపీ అధినేత బుజ్జగించినా శివరామరాజు వెనక్కి తగ్గలేదు. బరిలో ఉంటానని క్లారిటీ ఇచ్చి మరీ నామినేషన్ వేయడంతో టీడీపీ కేడర్‌లో గుబులు మొదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే శివరామరాజుకి ముందుగానే సీటు కేటాయించింది అధిష్ఠానం. దీంతో టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే రామరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. రెబల్‌గా పోటీ చేస్తానని ప్రకటించారు. అయినప్పటికీ శివరామరాజు నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించారు. ఈ క్రమంలోనే రఘురామ కృష్ణం రాజు ఎంట్రీ ఇచ్చారు. చంద్రబాబుతో భేటీ కావడం.. ఉండి టికెట్ ఆయనకు ఖరారు చేయడం చకచకా జరిగిపోయాయి. దీంతో శివరామరాజు డైలమాలో పడిపోయారు. చంద్రబాబు సర్దిచెప్పినా.. రఘురామ కృష్ణంరాజు ప్రాధేయపడ్డా శివరామరాజు వెనక్కి తగ్గలేదు. ఇవాళ స్వతంత్ర అభ్యర్థిగా భారీ ర్యాలీ మధ్య నామినేషన్ వేశారు. అంతేకాదూ.. విజయంపై ధీమా వ్యక్తం చేశారాయన.
శివరామరాజు నామినేషన్‌తో రఘురామ కృష్ణంరాజు ఝలక్ తగిలినట్టయింది. ఎవరేం చేసినా విజయం నాదేనని కాన్ఫిడెంట్‌గా ఉన్నారాయన. ఉండి టిడీపీ టికెట్ ఆశించిన రామరాజు ఇప్పటికే రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. లేటెస్ట్‌గా శివరామరాజు ఇండిపెండెంట్‌గా పోటీలోకొచ్చారు. టీడీపీ తరపున రఘురామకృష్ణంరాజు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఫైనల్‌గా ఏం జరగబోతుంది? టీడీపీ ఓటు చీలిపోతుందా? గంపగుత్తగా ఒక్కరికే పడుతుందా? ఈ టెన్షన్ ముగ్గురు అభ్యర్థుల్ని కంగారుపెడుతోంది. ప్రస్తుతం ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నామినేషన్ వేస్తున్న అభ్యర్థుల నుంచి పార్టీలకు రెబల్స్ బెడత వెంటాడుతోంది. మరీ ముఖ్యంగా కూటమిలో తీవ్ర అసంతృప్తితో ఉన్న నేతలు ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచే కాకుండా.. మరోవైపు నెల్లూరు జిల్లా కావలి టికెట్ పొలిటికల్ హీట్ పెంచుతోంది. టీడీపీ అభ్యర్థిగా కావ్య క్రిష్ణారెడ్డి బరిలో దిగుతుండగా.. కూటమిని నుంచి ఆమెకు సపోర్ట్ కరువయ్యింది. ఆమెకు సీటు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్న బీజేపీ నేత పసుపులేటి సుధాకర్ రెబల్‌గా పోటీకి సిద్ధమయ్యారు. బీజేపీని వీడి టీడీపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఆయన.. చంద్రబాబు మోసం చేశారంటూ మండిపడ్డారు. ఈ క్రమంలోనే.. ఇండిపెండెంట్‌గా బరిలో దిగేందుకు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు జోరుగా ప్రచారం నిర్వహిస్తూ దూకుడు మీదున్నారు. అయితే నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుండటంతో రేపటి నంచి వాటిని పరిశీలించనున్నారు అధికారులు. ఏప్రిల్ 29 వరకు నామినేషన్లు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో రెబల్ గా బరిలో దిగిన వారితో మంతనాలు జరుపుతున్నారు నిజమైన అభ్యర్థులు, ఆయా పార్టీల అధినేతలు. ఇది ఎంతవరకు సర్థుమణుగుతుందో వేచి చూడాలి.
ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..