- Telugu News Photo Gallery Business photos Online Shopping Scam Things To Keep In Mind While Shopping Online
Online Shopping: ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.. లేకుంటే మోసపోతారు!
Online Shopping: చాలా మంది ఆన్‌లైన్ షాపింగ్‌లకు అలవాటు పడ్డారు. ఇలాంటి సమయంలో ఆన్‌లైన్ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యమని, లేకుంటే చాలా మోసపోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు..
Updated on: Nov 12, 2024 | 9:54 PM

ఆన్‌లైన్ షాపింగ్ క్రేజ్ చాలా పెరిగింది. భారతదేశంలో అధిక సంఖ్యలో ప్రజలు షాపింగ్ కోసం ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లను ఆశ్రయిస్తున్నారు. కానీ పెరుగుతున్న ప్రజాదరణతో స్కామర్ల ద్వారా మోసం చేసే మార్గాలు కూడా పెరిగాయి. ఇప్పుడు రకరకాల పద్ధతులతో ప్రజలను మోసం చేస్తున్నారు.

ప్రభుత్వం హెచ్చరిక జారీ! పండగల సందర్భంగా ఆన్‌లైన్ షాపింగ్ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇది చూసి ప్రభుత్వం అనేక హెచ్చరికలు కూడా చేసింది. ప్రభుత్వం కూడా మోసాల బారిన పడకుండా అనేక చర్యలు చేపడుతోంది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ హ్యాండిల్ ట్వీట్ చేసింది. ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా మోసాన్ని ఎలా నివారించవచ్చో వివరించింది.

వెబ్‌సైట్ URLని తనిఖీ చేయండి- ఏదైనా వెబ్‌సైట్ నుండి ఆన్‌లైన్ షాపింగ్ చేసే ముందు ఖచ్చితంగా ఆ వెబ్‌సైట్ URLని తనిఖీ చేయండి. అందులో 'https' రాసి ఉందో లేదో చెక్ చేయండి. ఇది కాకుండా, వెబ్‌సైట్ పేరును ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి. చాలా సార్లు స్కామర్లు పేరు స్పెల్లింగ్‌ని మార్చడం ద్వారా ప్రజలను మోసం చేస్తారు. ఆ స్పెల్లింగ్‌లను సరిగ్గా చెక్ చేసుకోండి. యూఆర్‌ఎల్‌లో ఒక అక్షరం మార్చి మోసాలకు పాల్పడుతుంటారు.

చెల్లింపు కోసం సురక్షితమైన గేట్‌వేని ఎంచుకోండి - చెల్లింపు చేయడానికి ఎల్లప్పుడూ సురక్షిత గేట్‌వే అంటే సురక్షిత మార్గాలను ఉపయోగించండి. చాలా సార్లు స్కామర్‌లు మరిన్ని డిస్కౌంట్‌లు, మరియు ఆఫర్‌ల పేరుతో ఇతర చెల్లింపు ఎంపికలతో ప్రజలను ఆకర్షిస్తారు. దీన్ని నివారించండి, ఎల్లప్పుడూ ప్రామాణికమైన క్రెడిట్, డెబిట్ కార్డ్ ద్వారా సురక్షిత చెల్లింపు గేట్‌వేని ఉపయోగించండి.

కస్టమర్ కేర్ నంబర్‌ను చెక్ చేయండి- షాపింగ్ చేయడానికి ముందు, విక్రేత గురించిన సమాచారం వ్రాయబడిందో లేదో తనిఖీ చేయండి. చాలా సార్లు మోసగాళ్లు తప్పుడు సమాచారం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. అందువల్ల ఎల్లప్పుడూ విక్రేత సమాచారాన్ని ధృవీకరించండి.

వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచండి: పెద్ద షాపింగ్ బ్రాండ్‌ల పేరుతో వ్యక్తుల మొబైల్ నంబర్‌లకు చాలాసార్లు నకిలీ సందేశాలు వస్తాయి. సందేశంలో KYC పేరుతో మొత్తం సమాచారాన్ని సేకరించి ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేసే ప్రయత్నం చేస్తారు. అటువంటి సందేశానికి ప్రతిస్పందించే ముందు లేదా లింక్‌పై క్లిక్ చేసే ముందు చెక్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.




