AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rinku Singh: తంతే గారెల బుట్టలో పడ్డట్టు.. రింకూ సింగ్‌కు మరో లక్కీ ఛాన్స్‌?

IPL 2025 కోసం రింకు సింగ్‌ను KKR రిటైన్ చేసుకుంది. ఈ ఆటగాడు KKR కొత్త కెప్టెన్‌గా మారవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కేకేఆర్ యాజమాన్యం రింకూ సింగ్‌కు జట్టు పగ్గాలు ఇవ్వాలని చూసినా..దానికి రింకూ సిద్ధంగా ఉన్నాడా అనేది సర్వత్ర చర్చాంశనీయమైంది.

Rinku Singh: తంతే గారెల బుట్టలో పడ్డట్టు.. రింకూ సింగ్‌కు మరో లక్కీ ఛాన్స్‌?
Rinku Singh
Velpula Bharath Rao
|

Updated on: Nov 13, 2024 | 12:30 AM

Share

ఈ మధ్య రింకూ సింగ్‌కు లక్ బాగా కలిసోస్తుంది. ఇటీవల, KKR అతనిని 13 కోట్ల రూపాయల భారీ ధరకు  రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. రింకూ సింగ్ KKR కొత్త కెప్టెన్ కావచ్చు అని వార్తలు వస్తున్నాయి. గత ఐపీఎల్ సీజన్లో కెప్టెన్‌గా ఉన్న అయ్యర్‌ను ఈసారి రిటైన్ చేసుకోలేదు. ఇప్పుడు అయ్యర్ స్థానంలో రింకూకి నాయకత్వం అప్పగించవచ్చని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది.

KKR కెప్టెన్‌గా రింకూ సింగ్?

కోల్‌కతా నైట్ రైడర్స్ తమ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ను రిటైన్ చేయలేదు. కేకేఆర్ శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలోనే చాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు అయ్యర్ తప్పుకోవడంతో, తదుపరి కెప్టెన్ ఎవరన్నది మేనేజ్‌మెంట్ ముందున్న పెద్ద ప్రశ్న మరియు రింకూ సింగ్ కూడా రేసులో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. రింకూ సింగ్ KKR కెప్టెన్‌గా ఉంటాడా అనే మరో ప్రశ్న కూడా లేవనెత్తుతుంది.

రింకూ సింగ్‌కు కెప్టెన్సీ లక్షణాలు ఉన్నాయా?

రింకూ సింగ్ చాలా కాలంగా దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్నాడు. ఇప్పుడు అతను ఐపిఎల్ మరియు టీమ్ ఇండియా రెండింటిలోనూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. రింకూ మ్యాగ్జిమమ్ ప్రెజర్ ఉన్న మ్యాచ్ ఫినిషర్ అని, ఒత్తిడిని తట్టుకునే సత్తా తనకు ఉందని రింకూ నిరూపించుకున్నాడు. కాబట్టి రింకూ సింగ్ కెప్టెన్‌గా రాణించగలడు. రింకూ UP T20 లీగ్‌లో మీరట్ మావెరిక్స్‌కు కూడా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ టీమ్ ఛాంపియన్‌గా నిలిచింది.

KKRలో రింకూ అనుభవం?

రింకు సింగ్ చాలా కాలంగా KKRలో ఉన్నాడు, అందువల్ల అతనికి జట్టు మేనేజ్‌మెంట్  గురించి బాగా తెలుసు. అతనికి జట్టులోని ప్రతి ఆటగాడి గురించి తెలుసు. అందరితో మంచి ర్యాపో కూడా రింకూ సింగ్‌కు ఉంది. ఏ ఆటగాడినైనా కెప్టెన్‌గా చేయడానికి ముందు జట్టు ఈ లక్షణాల కోసం చూస్తుంది. రింకూ ఈ లక్షణాలు ఉన్నాయని నిర్మొహమాటంగా చెప్పవచ్చు.  KKR నిజంగా రింకూ సింగ్‌ను కెప్టెన్‌గా చేస్తుందా లేదా అనేది చూడాలి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?