Ind vs Pak: భారత్ పాక్ మ్యాచ్ రద్దైతే .. ఎవరికి నష్టం?

పాకిస్థాన్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025పై భారత్ అభ్యంతరం చెబుతుంది. పాక్ వెళ్లేందుకు టీమ్ ఇండియా నిరాకరించింది. దీనిపై స్పందించిన పాకిస్థాన్ హైబ్రిడ్ మోడ్ కు సిద్ధంగా లేమని స్పష్టం చేసింది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ క్యాన్సిల్ అయితే ఏం జరుగుతుంది?

Ind vs Pak: భారత్ పాక్ మ్యాచ్ రద్దైతే .. ఎవరికి నష్టం?
India Vs Pakistan Champions Trophy Controversy Is Big Threat For Icc's Income Generation
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Nov 12, 2024 | 9:53 PM

భారత్ పాకిస్థాన్ జట్ల మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతుంది. పాకిస్థాన్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025పై భారత్ అభ్యంతరం చెబుతుంది. పాక్ వెళ్లేందుకు టీమ్ ఇండియా నిరాకరించింది. దీనిపై స్పందించిన పాకిస్థాన్ హైబ్రిడ్ మోడ్ కు సిద్ధంగా లేమని స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం 8 జట్లతో జరిగే ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ రెండూ లేకుండానే ఆడనున్నట్టు తెలుస్తోంది. దీని వల్ల టోర్నీలో పస ఉండదని చెప్పవచ్చు. ఎలిమినేట్ అయిన జట్టు కూడా ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. అతిపెద్ద నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. గత కొన్నేళ్లుగా భారత్-పాకిస్థాన్ మధ్య వివాదం నడుస్తోంది, దీని కారణంగా గత 12-13 ఏళ్లుగా ఇరు జట్లు ఏ ద్వైపాక్షిక సిరీస్‌లో పాల్గొనలేదు. అయినప్పటికీ, భారత్ పాకిస్తాన్ ప్రపంచ కప్, ఆసియా కప్ వంటి టోర్నమెంట్లలో పోటీ పడుతున్నాయి. ఇది ఇరు దేశాల అభిమానులకు ఎంతోగాను ఉత్సహాన్ని ఇస్తుంది.

భారత్-పాకిస్థాన్ మ్యాచ్ క్యాన్సిల్ అయితే ఏం జరుగుతుంది?

భారతదేశం, పాకిస్తాన్ మధ్య ప్రపంచ కప్ లేదా మరేదైనా టోర్నమెంట్ మ్యాచ్ అంటే ఇరు దేశాల అభిమానులు ఎగిరి గంతేస్తారు. అలాగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కు ఐసీసీ కూడా బాగానే డబ్బును సంపాదిస్తుంది. ICC ప్రసార ఒప్పందాల నుండి అత్యధికంగా సంపాదిస్తుంది. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌లో అడ్వర్టైజ్‌మెంట్ స్లాట్‌ల ధర అత్యధికంగా ఉంటుంది. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌లో స్లాట్ సెకనుకు రూ.4 లక్షలు పలికింది. మొత్తం టోర్నీలో ఏ మ్యాచ్‌లోనూ ఇంత అత్యధిక ధర పలకపోవడం గమనార్హం. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ను టీవీల్లో 17.3 కోట్ల మంది వీక్షించగా, 22.5 కోట్లు మంది డిజిటల్‌ వీక్షకులు ఉన్నారు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ప్రాముఖ్యత ఏమిటో చెప్పడానికి ఇది ఒక్కటి చాలు. సహజంగానే ఇది బ్రాడ్‌కాస్టర్‌కు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు భారతదేశం-పాకిస్తాన్ మ్యాచ్ జరగకపోతే, అది ప్రసారకర్తపై ప్రభావం చూపుతుంది. ICC ఆదాయాలపై ప్రభావం పడుతుంది.

ప్రసారం మాత్రమే కాదు, ఐసిసి అందుకున్న స్పాన్సర్‌షిప్‌లో భారతదేశం-పాకిస్తాన్ మ్యాచ్ కూడా పెద్ద పాత్ర పోషిస్తుంది. 2024 T20 ప్రపంచ కప్‌లో భారతదేశం పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ నుండి ICC సుమారు $25 మిలియన్లు సంపాదించింది. ఆదాయాల తగ్గింపు ICCని ప్రభావితం చేయడంతో పాటు ICC నుండి పొందే డబ్బుపై ఆధారపడి ఉండే అనేక చిన్న క్రికెట్ బోర్డులను కూడా ప్రభావితం చేస్తుంది. వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే వంటి అనేక క్రికెట్ బోర్డులు ICC నుండి ఆర్థిక సహాయం పొందుతాయి. ఐసీసఈ ఆదాయాలు ప్రభావితమైతే చిన్న క్రికెట్ బోర్డుల ఆదాయాలు కూడా ప్రభావితమవుతాయి. అంటే భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ కేవలం వినోదం, ఉత్కంఠకు మాత్రమే కాదు, క్రికెట్ నిర్వహణకు కూడా ముఖ్యమని స్పష్టమవుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..