AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fake Calls: ఫేక్ కాల్స్ కట్టడి ప్రభుత్వం కీలక చర్యలు.. ఆ రెండు వ్యవస్థలతో మోసాలకు చెక్

ప్రస్తుత రోజుల్లో ఫోన్ వినియోగం భారీగా పెరిగింది. ఇంట్లో ఎంత మంది కుటుంబ సభ్యులు ఉంటే అన్ని ఫోన్లు ఉంటున్నాయంటే అతిశయోక్తి కాదు. గతంలో పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఫోన్ వినియోగం క్రమేపి పల్లెటూర్లకు చేరింది. అయితే ఈ ఫోన్ ఆధారంగా చేసే మోసాలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఫేక్ కాల్స్ కట్టడికి ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. ఆ చర్యల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Fake Calls: ఫేక్ కాల్స్ కట్టడి ప్రభుత్వం కీలక చర్యలు.. ఆ రెండు వ్యవస్థలతో మోసాలకు చెక్
Nikhil
|

Updated on: Nov 12, 2024 | 9:43 PM

Share

భారతదేశంలో మోసం చేయాలనే తలంపుతో చేసే ఫోన్ కాల్స్ సంఖ్య చాలా ఎక్కువయ్యాయి. ఈ ఫేక్ కాల్స్ కారణంగా ప్రతిరోజూ ప్రజలు రూ.500 నుంచి రూ.5 కోట్ల వరకు మోసానికి గురవుతున్నారు. దీన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం వివిధ ప్రయత్నాలు చేస్తుంది. ప్రతిరోజూ దాదాపు 1.35 కోట్ల మోసపూరిత కాల్‌లను ప్రభుత్వం బ్లాక్ చేస్తోందని దీని వల్ల ప్రజలు ఇప్పటివరకు రూ.2500 కోట్ల మేర మోసపోకుండా కాపాడగలిగామని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. విదేశాల్లో ఉన్న సర్వర్‌ల నుంచి ఎక్కువగా ఫ్రాడ్ కాల్స్ వస్తున్నాయని సింధియా చెప్పారు. ఇలాంటి కాల్స్ చాలా వరకు బ్లాక్ చేయడంలో ప్రభుత్వ వ్యవస్థ సక్సెస్ అయ్యిందని సంతోషం వ్యక్తం చేశారు. మీ ఫోన్‌కు వస్తున్న మార్కెటింగ్, మోసపూరిత కాల్‌లను ఆపడానికి మేము పూర్తి వ్యవస్థను సిద్ధం చేశామని స్పష్టం చేశారు. 

ప్రభుత్వ టెలికాం శాఖ (డీఓటీ) మోసాన్ని గుర్తించేందుకు “సంచార్ సతి”, “చక్షు” అనే సర్వీసులను అభివృద్ధి చేసింది. ఈ రెండు వ్యవస్థల ద్వారా ఇప్పటి వరకు రూ.2500 కోట్ల ప్రజల సొమ్ము మోసానికి గురి కాకుండా కాపాడారు. ఈ సిస్టమ్ సహాయంతో దాదాపు 2.9 లక్షల ఫోన్ నంబర్‌లు డిస్‌కనెక్ట్ చేశారు. అలాగే స్పామ్ సందేశాల కోసం ఉపయోగించిన 18 లక్షలకు పైగా హెడర్‌లు బ్లాక్ చేశారు. కొంతమంది భారతీయ (+91) నంబర్‌ల మాదిరిగా విదేశీ సర్వర్‌లను ఉపయోగించి కాల్స్ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసి మరీ మోసాలకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి కాల్స్‌ను ప్రతిరోజూ సగటున 1.35 కోట్ల ఫేక్ కాల్‌లను బ్లాక్ చేస్తున్నారు.

ప్రభుత్వం కొత్త సాఫ్ట్‌వేర్ కింద 520 ఏజెన్సీలను జోడించింది. ఇందులో దర్యాప్తు సంస్థలు, బ్యాంకులు కూడా ఉన్నాయి. ఈ చర్యలతో ఫైనాన్స్ ఆధారిత మోసాలు తగ్గుతాయి.  అలాగే మే నాటికి స్వీయ ఆధారిత బీఎస్ఎన్ఎల్ 5జీని విడుదల చేయడంతో పాటు ఏప్రిల్ నాటికి అన్ని ప్రాంతాలలో 4జీ అందించడం తన ప్రధాన లక్ష్యాలలో ఉన్నాయని సింధియా చెబుతున్నారు. ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్ కోసం 1 లక్ష బేస్ స్టేషన్లను నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేశామని స్పష్టం చేశారు. వాటిలో 50,000 టవర్లు ఇప్పటికే అమర్చామని, ఈ పథకం కింద బీఎస్ఎన్ఎల్ 4 జీ తర్వాత 5జీకు వేగంగా మార్చవచ్చు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి