పూలకుండీల్లో గంజాయి వనం !! బెంగళూరులో ఓ జంట నిర్వాకం
పూల కుండీల్లో పూల చెట్లు పెంచితే ఏం కిక్కు అనుకుంది ఆ జంట. ఏకంగా కిక్కుకే కిక్కు ఇచ్చే గాంజాయి మొక్కలు పెంచింది. అంతేనా.. తమ ఇగురం చూడండి అంటూ ఫొటులో దిగి ఫేస్ బుక్‌లో పెట్టేశారు. ఇంకేముందు అత్యుత్సాహంతో అడ్డంగా బుక్ అయ్యారు. బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ జంట తమ బాల్కనీలోని పూల కుండీలో వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు.
రెండు కుండీల్లో గంజాయి మొక్కలు కూడా వేశారు. అయితే, ఇటీవల ఉర్మిళ తన బాల్కనీలో పెంచుతున్న వివిధ మొక్కలతో ఫోటో దిగి దాన్ని తన సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ ఫోటో నెట్టింట వైరల్ అవ్వడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. ఉర్మిళ బంధువు ఒకరు పోలీసులు వచ్చేలోపు కుండీలోని గంజాయి మొక్కల్ని తీసిపారేశారు. ఐతే, పోలీసులు కుండీల్లో గంజాయి ఆకుల్ని గుర్తించారు. 54 గ్రాములు ఉన్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లాభసాటిగా విక్రయించాలనే ఆలోచనతోనే గంజాయిని పెంచుతున్నట్లు దంపతులు అంగీకరించారు. దంపతులపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పీఎం ఇంటర్న్‌షిప్ కు అప్లయ్ చేశారా ?? రూ.66 వేలు ఇస్తారు.. ఎలా అంటే ??
ఫీజు కట్టాలి.. లైసెన్స్ తీసుకోవాలి.. వాట్సాప్ అడ్మిన్లకు షాక్
Helicobacter pylori: గోరుముద్ద నుంచే పైలోరీ బ్యాక్టీరియా
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

