- Telugu News Photo Gallery Cinema photos Allu Arjun Interesting Comments on Chiranjeevi at Nandamuri Balakrishna's Unstoppable Show
Unstoppable With NBK: బాలయ్య షోలో బన్నీ.. చిరుపై ఆసక్తికర కామెంట్స్
బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 4 దిగ్విజయంగా నడుస్తుంది. ఎపిసోడ్ ఎపిసోడ్‌కు వచ్చే గెస్టుల రేంజ్ పెరిగిపోతుంది. లేటెస్ట్ ఎపిసోడ్‌కు అల్లు అర్జున్ అతిథిగా వచ్చారు. ఆయనతో పాటు మరో సర్‌ప్రైజ్ స్టార్ కూడా వచ్చారు. మరి ఎవరు వాళ్లు..? నేషనల్ అవార్డుపై అల్లు అర్జున్ చెప్పిన మాటేంటి..? చిరంజీవిపై బన్నీ చేసిన కామెంట్స్ ఏంటి..? అవన్నీ ఈ స్టోరీలో చూద్దాం..
Updated on: Nov 12, 2024 | 9:34 PM

రీసెంట్‌గా ఈ మూవీ షూట్ కంప్లీట్ చేశారు బాలకృష్ణ. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అఖండ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జోరుమీదున్నాయి. కొత్త సంవత్సరంలో అఖండ 2 తాండవం షూట్ స్టార్ట్ చేసేస్తారు బాలయ్య.

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2తో బిజీగా ఉన్నారు. ఓ వైపు ప్రమోషన్స్.. మరోవైపు షూటింగ్‌తో కంటిమీద కునుకు లేకుండా కష్టపడుతున్నారు. ఈ సినిమా కోసం దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

ఇంత బిజీలో ఉండి కూడా.. తాజాగా అన్‌స్టాపబుల్ షోకు వచ్చారు బన్నీ. అన్‌స్టాపబుల్ షోలో చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చారు అల్లు అర్జున్. ముఖ్యంగా తనకు వచ్చిన నేషనల్ అవార్డు గురించి ఓపెన్ అయ్యారు బన్నీ.

అవార్డు వచ్చినపుడు తను ఏమనిపించింది అని బాలయ్య అడిగినపుడు.. చాలా మెచ్యూర్డ్‌గా ఆన్సర్ ఇచ్చారు అల్లు వారబ్బాయి. అంతేకాదు.. చిరంజీవిపై కూడా మనసులో మాట చెప్పారు బన్నీ. ప్రోమో చూస్తుంటే.. చిరంజీవి గురించి మాత్రమే కాదు.. ఇంకా చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చినట్లు అర్థమవుతుంది.

ఈ షోకు మరో అతిథిగా అల్లు అర్జున్ అమ్మగారు నిర్మల కూడా వచ్చారు. చిన్నపుడు బన్నీ చేసిన అల్లరిపై ఈమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. నవంబర్ 15న పార్ట్ 1 ఎపిసోడ్ ఆహాలో ప్రసారం కానుంది. రెండో ఎపిసోడ్ తర్వాతి వారం రానుంది.




