Andhra Pradesh: కన్నెర్రజేస్తోన్న కడలి.. గ్రామాలను ముంచెస్తోన్న రాకాసి కెరటాలు.. ఉప్పునీటితో నిండిపోయిన పొలాలు

ఉవ్వెత్తిన ఎగిసిపడుతోన్న సముద్రపు కెరటాలకు సర్వే తోటలు ప్రమాదంలో పడుతున్నాయ్. సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేదికర, కేశవదాసుపాలెం గ్రామాల్లో ఈ ఎఫెక్ట్‌ ఎక్కువగా కనిపిస్తోంది.

Andhra Pradesh: కన్నెర్రజేస్తోన్న కడలి.. గ్రామాలను ముంచెస్తోన్న రాకాసి కెరటాలు.. ఉప్పునీటితో నిండిపోయిన పొలాలు
Sea Water Level
Follow us

|

Updated on: Oct 02, 2022 | 7:42 AM

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో సముద్రం ఉప్పొంగుతోంది. ఉప్పు నీరు పొలాలను ముంచెత్తుతోంది. సఖినేటిపల్లి తీరంలో సముద్రం ఉప్పొంగుతుండడంతో ఉప్పునీరు పంట పొలాల్లోకి చొచ్చుకొస్తోంది. ఉవ్వెత్తిన ఎగిసిపడుతోన్న సముద్రపు కెరటాలకు సర్వే తోటలు ప్రమాదంలో పడుతున్నాయ్. సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేదికర, కేశవదాసుపాలెం గ్రామాల్లో ఈ ఎఫెక్ట్‌ ఎక్కువగా కనిపిస్తోంది. రెండ్రోజులుగా పంట పొలాలను ముంచెత్తుతోంది సముద్రపు నీరు. సముద్రపు ఉప్పునీరు గ్రామాలను ముంచెత్తుతుండటంతో ఆందోళనకు గురవుతున్నారు స్థానికులు. ఇసుక మాఫియా వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సముద్ర తీరాన్ని కూడా తవ్వేయడం వల్లే కెరటాలు గ్రామాల్లోకి చొచ్చుకు వస్తున్నాయని అంటున్నారు సఖినేటిపల్లి మండల గ్రామాల ప్రజలు. ఇసుక మాఫియాను నియంత్రించి సముద్ర తీరం వెంబడి మడ అడవులను పెంచకపోతే తీర ప్రాంత గ్రామాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు స్థానికులు.

ఈ నేపథ్యంలో సఖినేటిపల్లి తీర ప్రాంతం వెంబడి రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ఆమధ్య క్రాప్‌ హాలిడే ప్రకటించిన కోనసీమ రైతుల డిమాండ్లలో కూడా ఇదొకటి. పంట పొలాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకు రాకుండా చర్యలు చేపట్టాలనేది. ఉప్పునీరు పంట పొలాల్లోకి చొచ్చుకురావడంతో వ్యవసాయ భూములు బీడులుగా, చౌడు భూములుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు రైతులు. సముద్రపు నీరు పంట పొలాల్లోకి రాకుండా, మురుగు నీరు సముద్రంలోకి పోయేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు స్థానికులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్‌లో వర్క్ ఫ్రం హోం, ఫొటో వైరల్
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్‌లో వర్క్ ఫ్రం హోం, ఫొటో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..