Rainbow Ring: ఆకాశంలో అద్భుతం దృశ్యం.. సూర్యాస్తమయ సమయంలో అబ్బురపరిచిన ఇంద్రధనస్సు..
ఆకాశంలో అద్భుతం దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్యాస్తమయ సమయంలో ఇంద్రదనస్సు ఏర్పడింది. ఇవాళ సాయంత్రం వర్షం కురిసి ఆగిపోయిన
ఆకాశంలో అద్భుతం దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్యాస్తమయ సమయంలో ఇంద్రధనస్సు ఏర్పడింది. ఇవాళ సాయంత్రం వర్షం కురిసి ఆగిపోయిన తర్వాత ఇంద్రధనుస్సు ఏర్పడింది. అలా కొద్దిసేపటి వరకు ఇంద్రధనుస్సు కనువిందు చేసింది. దీంతో అక్కడే ఉన్న కొందరు.. ఆ అందమైన దృశ్యాన్ని తమ సెల్ ఫోన్లలో బంధించారు.
సాధారణంగా వర్షం కురిసిన తర్వాత ఇంద్రధనుస్సులు ఏర్పడడం సహజమే. కానీ.. చాలా సార్లు.. అవి మనకు స్పష్టంగా కనిపించవు. వాతావరణంలోని నీటి బిందువులపై పడిన కాంతి కిరణాలు వక్రీభవనం చెందడం వల్ల ఇంద్రధనుస్సులు ఏర్పడతాయి. తాజాగా కడప జిల్లా కమలాపురంలో అరుదైన దృశ్యం అక్కడి స్థానికులను కట్టిపడేసింది. ఈరోజు కమాలాపురంలో ఉదయం నుంచి వానలు విస్తారంగా కురుస్తున్నాయి. అయితే సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో వర్షం ఆగిపోయిన తర్వాత ఆకాశంలో ఇంద్రధనస్సు ఏర్పడింది. దీంతో ఆ అందమైన దృశ్యాన్ని చూసేందుకు ఇళ్లలో నుంచి జనాలు బయటకు వచ్చారు. అక్కడే ఉన్న కొందరు యువకులు ఆ దృశ్యాన్ని తమ సెల్ ఫోన్లలో బంధించి.. సోషల్ మీడియాలో షేర్ చేశారు.
వీడియో..
Kim Sharma: టెన్నిస్ ఆటగాడు లియాండర్ ఫేస్‌తో “ఖడ్గం” హీరోయిన్ ప్రేమాయణం.. స్పందించిన మాజీ ప్రియుడు..