Punganur: సీమలో కొత్త పొలిటికల్ సెగ.. మంత్రి పెద్దిరెడ్డిని ట్రబుల్ చేస్తున్న ఆ నేత ఎవరు..?

పుంగనూరులో నువ్వానేనా... తేల్చుకుందాం రా..! ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నట్టింట్లో కొత్త శత్రువు పుట్టేశారు. బస్తీ మే సవాల్ అంటున్న ఆ తాజా మాజీ రాజకీయ నాయకుడు ఎవరు..? పెద్దిరెడ్డికి ఆయనకీ మధ్య ఏదైనా ఫ్లాష్‌బ్యాక్ ఉందా? సీమలో ఇదొక కొత్త పొలిటికల్ సెగ.

Punganur: సీమలో కొత్త పొలిటికల్ సెగ.. మంత్రి పెద్దిరెడ్డిని ట్రబుల్ చేస్తున్న ఆ నేత ఎవరు..?
Peddireddy Ramachandra Reddy
Follow us

|

Updated on: May 28, 2023 | 5:06 PM

రామచంద్రయాదవ్… పారిశ్రామికవేత్త… గతంలో రాజకీయాల్లో చురుగ్గానే ఉన్నా.. ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేరు. 2019 ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యాక సైలెన్స్‌ మోడ్‌లోకి వెళ్లారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. పుంగనూరు ఎమ్మెల్యే, క్యాబినెట్ మంత్రి, వైసీపీ సర్కార్‌లో కీలక నాయకుడు. సీఎం జగన్ కుటుంబానికి దగ్గరి వ్యక్తి. ఇప్పుడు వీళ్లిద్దరి మధ్య పుంగనూరులో నువ్వానేనా రేంజ్‌లో వార్‌ నడుస్తోంది.

లేటెస్ట్‌గా ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రంలో వేల కోట్ల దోపిడీ జరుగుతోందంటూ ఎటాక్ షురూ చేశారు రామచంద్రయాదవ్. చిత్తూరు జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్ని హెలికాఫ్టర్‌ బుక్ చేసుకుని మరీ ఏరియల్ సర్వే చేయడం జిల్లాలో హాట్ టాపిక్కైంది. క్షేత్రస్థాయి పర్యటనకు వెళితే పోలీసులు అడ్డుకున్నారని… అందుకే ఇలా ఏరియల్‌ సర్వే చేస్తున్నానని చెబుతూ పెద్దిరెడ్డి టార్గెట్‌గా వీడియోలు రిలీజ్ చేశారు.

గతంలో పుంగనూరులోని రామచంద్ర యాదవ్ ఇంటిపై దాడి జరిగింది. కర్రలు, రాళ్లతో తలుపులు, అద్దాలు బద్దలుకొట్టారు. ఈ దాడి వెనుక మంత్రి పెద్దిరెడ్డి ప్రమేయముందనేది అనుమానం. ఆ సమయంలో తనకున్న పరిచయాలతో ఏకంగా అమిత్ షాను కలిసి..  Y+ భద్రత తెచ్చుకున్నారు.  అప్పటినుమంచి వీళ్లిద్దరి మధ్య పుంగనూరులో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇప్పుడు ఏరియల్ సర్వే ఎపిసోడ్… ఈ విబేధాలను ఇంకా హీటెక్కించేసింది. అంతేకాదు వరస పర్యటనలు చేస్తూ జనాల్లో తన ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు రామచంద్ర యాదవ్. ఈసారి ఆయన ఏదో ఓ పార్టీ నుంచి బరిలోకి దిగి పెద్దిరెడ్డిని ఓడించాలనుకున్నట్లు తెలుస్తోంది.

Ramachandara Yadav

Ramachandara Yadav

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..