Pawan Kalyan: నియంతలతో యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైంది.. వైరలవుతున్న పవన్ కల్యాణ్ ట్వీట్
ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాటుపడుతున్నారు. అందుకోసం పొత్తులకు కూడా సిద్ధమవుతున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా, సీఎం జగన్‌పై, వైసీపీ నాయకులపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. జనసేన పార్టీ బలం రాష్ట్రంలో 18 శాతం పెరిగిందని ఇటీవల పవన్ కల్యాణ్ అన్నారు.
ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాటుపడుతున్నారు. అందుకోసం పొత్తులకు కూడా సిద్ధమవుతున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా, సీఎం జగన్‌పై, వైసీపీ నాయకులపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. జనసేన పార్టీ బలం రాష్ట్రంలో 18 శాతం పెరిగిందని ఇటీవల పవన్ కల్యాణ్ అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఉత్తరాంధ్ర వరకు ఈ బలం 30 నుంచి 35 శాతం ఉంటుందని భావిస్తున్నామని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి ఎవరూ అనే దానిపై ఎన్నికల తర్వాత నిర్ణయించాల్సిన విషయమని.. దీని గురించి కాకుండా ఎన్నికల్లో పార్టీని బలంగా నిలబెట్టడం ముఖ్యమని ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను చూపిస్తూ ప్రశ్నిస్తుంటారు. అయితే ఇప్పుడు తాజాగా వైసీపీ సర్కార్‌పై చేసిన ఓ ట్వీట్ వైరలవుతోంది. నియంతలతో యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైంది అని ఓ కార్టున్ ఫోటోను షేర్ చేశారు. అందులో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని పల్లకిలో వైసీపీ నాయకులు, అధికారులు మోసుకెళ్లడం కనిపిస్తుంది. దాని పక్కనే ”కొత్త దేవుడండి, కొంగ్రొత్త దేవుడండి, ఇతడే దిక్కని మొక్కపోతే దిక్కుమొక్కు లేదండండి” అంటూ రాయడం కనిపిస్తుంది. అయితే వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ.. యుద్ధానికి సమయం ఆసన్నమైందంటూ ఇప్పడు చేసిన ఈ ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. జనసేన కార్యకర్తలు, ఆయన అభిమానులు జై జనసేన అంటూ భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..