AP KGBV Recruitment 2023: మహిళా నిరుద్యోగులకు అలర్ట్.. కస్తూర్భా గాంధీ విద్యాలయలో 1358 టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఒప్పంద ప్రాతిపదికన 1358 టీచర్ (ప్రిన్సిపాల్, పీజీటీ, సీఆర్‌టీ, పీఈటీ) ఉద్యోగాల పోస్టుల భర్తీకి విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు మహిళా అభ్యర్ధులు మాత్రమే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఒప్పంద ప్రాతిపదికన 1358 టీచర్ (ప్రిన్సిపాల్, పీజీటీ, సీఆర్‌టీ, పీఈటీ) ఉద్యోగాల పోస్టుల భర్తీకి విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు మహిళా అభ్యర్ధులు మాత్రమే అర్హులు. దరఖాస్తు చేయగోరేవారు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి ఎంత ఉండాలంటే..
జనరల్ అభ్యర్థులకు తప్పనిసరిగా 18 నుంచి 42 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ బీసీలకు అయిదేళ్లు, మాజీ సైనిక ఉద్యోగులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు సడలింపు ఉంటుంది.
ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ మే 29వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. జూన్ 4, 2023వ తేదీ రాత్రి 11:59 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో ప్రతి ఒక్కరూ రూ.100లు రిజిస్ట్రేషన్ ఫీజు కింద చెల్లించవల్సి ఉంటుంది. ఎంపిక విధానం, జిల్లాలు, సబ్జెక్టుల వారీగా ఖాళీలు, జీతభత్యాలు వంటి ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు..
- ప్రిన్సిపాల్ పోస్టులు: 92
- పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ) పోస్టులు: 846
- సీఆర్‌టీ పోస్టులు: 374
- ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(పీఈటీ) పోస్టులు: 46
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.