AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: భూదేవి చెప్పిందంటూ గొయ్యి తవ్వాడు.. అందులోకి వెళ్లి నగ్నంగా కూర్చుని..

భూదేవి పిలిచిందంటూ ఓ వ్యక్తి సజీవ సమాధి అయ్యేందుకు ప్రయత్నించగా.. సరైన సమయంలో పోలీసులు అక్కడికి చేరుకొని అడ్డుకున్న ఘటన ప్రకాశం జిల్లా తాళ్లూరులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కైపు కోటిరెడ్డి పన్నెండేళ్ల క్రితం ఊరి శివారున తమ పొలంలో భూదేవి ఆలయాన్ని సొంతంగా నిర్మించాడు. తాను భూదేవి పుత్రుడిని.. తరచూ భూమాత తన ఒంట్లోకి వస్తుందని, తను భూగర్భంలోకి వెళ్లిపోతానంటూ సజీవ సమాధికి సిద్ధమయ్యాడు.

Andhra: భూదేవి చెప్పిందంటూ గొయ్యి తవ్వాడు.. అందులోకి వెళ్లి నగ్నంగా కూర్చుని..
Representative Image
Ravi Kiran
|

Updated on: Mar 31, 2025 | 10:57 AM

Share

టెక్నాలజీ యుగంలో మనిషి ఎంతగానో అభివృద్ధి చెందుతున్నాడు. అంతరిక్షానికి సైతం రాకపోకలు సాగిస్తున్న ఆధునిక యుగంలోనూ మనుషులు మూఢవిశ్వాసాలు వీడటంలేదా అంటే… అవుననే అనిపిస్తోంది ఈ ఘటన చూస్తే. ఓ వ్యక్తి తాను భూదేవి పుత్రుడిని.. తరచూ భూమాత తన ఒంట్లోకి వస్తుందని, తను భూగర్భంలోకి వెళ్లిపోతానంటూ సజీవ సమాధికి సిద్ధమయ్యాడు. విషయం పోలీసులకు తెలియడంతో సకాలంలో అక్కడికి చేరుకొని ఆ వ్యక్తి దీక్షను భగ్నం చేయడంతో బతికి బయటపడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని తాళ్లూరు మండలం విఠలాపురానికి చెందిన మాజీ సర్పంచ్ కైపు అంజిరెడ్డి కుమారుడు కైపు కోటిరెడ్డి కొన్నేళ్ల క్రితం ఊరి చివరలోని తన పొలంలో భూదేవి అమ్మవారి ఆలయం నిర్మించాడు. అక్కడ నిత్య పూజలు చేస్తూ అమ్మవారిని ఆరాధిస్తున్నాడు. ఈ క్రమంలో ఆలయ సమీపంలో ఆరడుగుల గొయ్యి తవ్వి అందులోకి వెళ్లి రోజూ ధ్యానం చేస్తున్నాడు. అంతేకాదు ఉగాది రోజు తను జీవసమాధి అవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా ఆదివారం తెల్లవారుజామున కుమారుడిని వెంటపెట్టుకొని ఆలయం వద్దకు చేరుకున్నాడు. తాను జీవసమాధి అవుతానని, అందుకు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న గొయ్యిని కుమారుడికి చూపించి, తాను గొయ్యిలోపలికి వెళ్లి ధ్యానం చేసుకుంటానని, ఇనుప రేకును ఉంచి, దానిపై మట్టితో పూడ్చి వేయమని కుమారుడికి చెప్పి, గొయ్యిలో నగ్నంగా కూర్చుని ధ్యానంలో మునిగిపోయాడు. తండ్రి చెప్పినట్టుగా కుమారుడు సమాధి చేశాడు. కోటిరెడ్డి జీవసమాధి అవుతున్నాడన్న విషయం తెలుసుకొని స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఎవరో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తక్షణం అక్కడికి చేరుకున్న పోలీసులు కోటిరెడ్డి దీక్షను భగ్నం చేసి ప్రాణాలతో బయటకు తీశారు. తాను ప్రపంచశాంతి కోసం దీక్ష చేస్తున్నానని కోటి రెడ్డి చెబుతున్నాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Horoscope Today: ఆ రాశి వ్యాపారులకు లాభాలే లాభాలు..
Horoscope Today: ఆ రాశి వ్యాపారులకు లాభాలే లాభాలు..
అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?