PM Modi: వికసిత్‌ భారత్‌.. వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌ మా లక్ష్యంః ప్రధాని మోదీ

కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో రాబోతున్నట్టు భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడిలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరునాడే ప్రధాని నరేంద్ర మోదీ పలనాడు జిల్లాలో జరిగిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

PM Modi: వికసిత్‌ భారత్‌.. వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌ మా లక్ష్యంః ప్రధాని మోదీ
Pm Modi At Palnadu
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 17, 2024 | 7:15 PM

కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో రాబోతున్నట్టు భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడిలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరునాడే ప్రధాని నరేంద్ర మోదీ పలనాడు జిల్లాలో జరిగిన భారీ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. అభివృద్ధి చెందిన భారతదేశానికి ఓటు వేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటేనని అభివర్ణించారు. జనం దృష్టి మరల్చేందుకు రెండు పార్టీ ప్రయత్నిస్తూ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు.

ఈ రోజు నుండి అసలు ప్రజాస్వామ్యం ప్రారంభమైందని ప్రధాని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని స్వాగతించాలని పిలుపునిచ్చారు. సభకు హాజరైన వారందరి చేత మొబైల్‌లోని ఫ్లాష్‌ని ఆన్ చేసి, వేడుకకు స్వాగతం పలకాలని ప్రధాని మోదీ అభ్యర్థించారు. ఈ భారీ జన సముద్రం ఢిల్లీకి కూడా సందేశం ఇస్తుందన్న ప్రధాని, ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రతి ఇంటికి సందేశం ఇస్తుందన్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే మిత్రపక్షాల బహిరంగ సభ జరగడం ఇదే తొలిసారి. ఈ ర్యాలీలో ప్రధాని మోదీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.

కోటప్ప కొండ దగ్గర బ్రహ్మ, విష్ణు మహేశ్వరుల ఆశీర్వాదంతో జనంలోకి వచ్చిన చెప్పిన ప్రధాని మోదీ జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు వేరు కాదన్న ప్రధాని మోదీ.. ఈ రెండూ ఒకటే అన్నారు. ఒకే కుటుంబానికి చెందిన వారు రెండు పార్టీలను నడుపుతున్నారు. ప్రభుత్వంపై కోపంగా ఉన్నవారు ఎన్డీయే లాభపడకుండా కాంగ్రెస్‌ వైపు వెళ్తున్నారన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ గర్వాన్ని కాంగ్రెస్‌ ఎప్పుడూ అవమానిస్తోందని ధ్వజమెత్తారు ప్రధాని. దేశ నాయకులను గౌరవించేది బీజేపీ మాత్రమే అన్నారు. నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా రూ.100 వెండి నాణెం విడుదల చేసిన ఘనత ఎన్డీయేకే దక్కతుందన్నారు. రాముడు, కృష్ణుడిని ఎన్టీఆర్‌.. తెలుగు సమాజంలో సజీవంగా ఉంచారన్నారు. ఆయన పోషించిన రాముడు, కృష్ణుడి పాత్రలు అజరామరమన్న ప్రధాని. తెలుగు వారికి కాంగ్రెస్‌ చేసిన అవమానంతోనే తెలుగుదేశం పార్టీ పుట్టిందన్నారు. పీవీ నరసింహారావును కాంగ్రెస్ ఎలా అవమానించింది మర్చిపోలేమన్నారు. తెలుగువారి ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు ఎన్డీయే ప్రభుత్వం.. ‘భారత రత్న’ ఇచ్చి గౌరవించింది’’ అని మోదీ చెప్పారు.

ఎన్డీయేలో అందరినీ వెంట తీసుకెళ్తాం, కానీ మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం కూటమిలోని ప్రజలను ఉపయోగించుకోవడం, పారద్రోలడమే ఏకైక ఎజెండా అన్నారు. కాంగ్రెస్‌ కూటమిని ఏర్పాటు చేయవలసి వచ్చింది. కానీ వారి ఆలోచన అలాగే ఉంది. బెంగాల్‌లో టీఎంసి, వామపక్షాలు పరస్పరం ఏం చెబుతున్నాయి? పంజాబ్‌లో కాంగ్రెస్ – ఆప్ ఒకరినొకరు ఏ భాషలో మాట్లాడుకుంటారు? అన్నదీ దేశ ప్రజలు గమనిస్తున్నారు.

ఈసారి ఎన్నికల ఫలితాలు జూన్‌4న రాబోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 400 పైగా సీట్లు రావాలి. అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్‌ను చూడాలనుకుంటే ఎన్డీయేకు 400+ సీట్లు వచ్చేలా కృషి చేయాలన్నారు. ఎన్డీయే కూటమికి ప్రాంతీయ భావాలతోపాటు, జాతీయ భావాలను కలుపుకొని ముందుకు వెళ్తామన్నారు. ఈ కూటమిలో చేరే భాగస్వాముల సంఖ్య పెరిగితే బలం పెరుగుతుంది. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ఇద్దరూ చాలా కాలం పాటు ఆంధ్రరాష్ట్ర వికాసానికి చేసిన కృషిని గుర్తించాలని కోరారు. ఎన్డీయే కూటమి లక్ష్యం వికసిత భారతదేశం. ఏపీలో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం ఉండాలి. అప్పుడే వికసిత ఆంధ్రప్రదేశ్‌ సాధ్యమవుతున్నారు ప్రధాని మోదీ.

ఆంధ్రా యువత సామర్థ్యాన్ని పెంపొందించేందుకు దేశాన్ని పెద్ద ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తున్నామన్నారు. తిరుపతిలో ఐఐటీ, కర్నూలులో ట్రిపుల్ ఐటీ, విశాఖపట్నంలో ఐఐఎం, మంగళగిరిలో ఎయిమ్స్, విజయవాడ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సహా పలు అత్యున్నత సంస్థలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశామని ప్రధాని గుర్తు చేశారు. ఎన్డీయే ప్రభుత్వం వల్ల పలనాడు నిరుపేద ప్రజలకు ఉచిత రేషన్‌ అందుతోంది. ఎన్డీయే ఎమ్మెల్యేలు గెలవాలి. ఎన్డీయే ఎంపీలందరూ గొప్ప సేవతో మీ కోసం పని చేస్తారన్న మోదీ హామీ ఇచ్చారు.

దేశంలో ఎన్డీయే ప్రభుత్వ అభివృద్ధి పనులపై చర్చ జరుగుతోంది. ఇక్కడ పలనాడులో దాదాపు 5000 శాశ్వత ఇళ్లు నిర్మించి పేదలకు అందించారు. కోటి కుటుంబాలకు కుళాయి కనెక్షన్‌ లభించింది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద, ఆంధ్రప్రదేశ్‌లో 1.25 కోట్ల మందికి పైగా పేదలు ఉచిత చికిత్స పొందారన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశం,. అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్‌ను సృష్టించడమే NDA లక్ష్యమన్నారు ప్రధాని మోదీ. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌డిఎ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉండటం ఇక్కడి అభివృద్ధికి మరింత ఊపునిస్తుందన్నారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పేదలకు సేవ చేసే ప్రభుత్వం. పేదల గురించి పట్టించుకునే ప్రభుత్వమిదని మోదీ అన్నారు.

ప్రధాని మోదీ ప్రసంగానికి ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్రం చేస్తున్న పలు పథకాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ పనితీరును ప్రశంసించారు. నోట్ల రద్దు, జీఎస్‌డీ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ నేడు కొత్త కోణంలో ఉందన్నారు. కరోనా సమయంలో, ప్రధాని మోదీ తన విధానాల ద్వారా కోట్లాది మంది ప్రజల ప్రాణాలను కాపాడారు. దేశానికి సరైన సమయంలో ప్రధాని మోదీ లాంటి నాయకుడు దొరికాడన్నారు. మేము మీతో ఉంటాము, ఇది మా వాగ్దానం అని చంద్రబాబు స్పష్టం చేశారు.

 మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..