Andhra Pradesh: కుల మతాలకు అతీతంగా వీరాజిలుతున్న ఏకైక ఆధ్యాత్మిక కేంద్రం..ఎక్కడంటే..
పిఠాపురం నియోజకవర్గ ఆధ్యాత్మిక ఖ్యాతి ఖండ ఖండంతరాలు దాటుతోంది.... పురాతన వివిధ ఆలయాల కట్టడాలతో పాటు హిందూ దేవాలయాల మొదలుకొని చర్చ్ .. మసీదులు.. అనేక పురాతన ఆలయాలతో పాటు భక్తుల రాక కూడా పిఠాపురం నియోజకవర్గానికి తాకిడి పెరగడంతో దేశ నలుమూలల నిత్యం భక్తులు ఇక్కడికి విచ్చేస్తుంటారు.. ఇటు చరిత్రకు సాక్షింగాను అటు ఆధ్యాత్మిక కేంద్రం గాను అభివృద్ధి చెందుతున్న పిఠాపురం ఆధ్యాత్మిక క్షేత్రాలపై ప్రత్యేక కథనం.....

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం రాష్ట్రంలోని ఒక విశిష్ట నియోజకవర్గంగా పేరొందింది… అన్ని మతాలకు చెందిన అతి పురాతన ఆలయాలు ఈ నియోజకవర్గంలో కొలువై ఉన్నాయి.. దానితో పిఠాపురాన్ని టెంపుల్ సిటీగా మారుస్తానంటూ ఎన్నికల్లో స్వయంగా పవన్ కల్యాణే హామీ ఇచ్చారు.. పవన్ కళ్యాణ్ నియోజకవర్గం లో అడుగుపెట్టిన నాటి నుంచి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా వరుస పెట్టి ఇక్కడ ఈవెంట్లు, షూటింగులు చేయడం మొదలుపెట్టారు..
త్రిగయాలలో ఒకటైన పాదగయ క్షేత్రం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పురుహూతికా అమ్మవారి ఆలయం,పంచమాధవలయాల్లో ఒకటైన కుంతీ మాధవ స్వామి ఆలయం, దత్తాత్రేయుడు ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభడు జన్మించిన మహాసంస్థానంతో పాటు శతాబ్ద కాలం క్రితం కెనడియన్ బాప్టిస్ట్ దొరలు నిర్మించిన అతి పురాతన చర్చ్ పిఠాపురం పట్టణంలో ప్రసిద్ధి చెందినవిగా ఉన్నాయి.. యు.కొత్తపల్లి మండలం కోనపాప పేట గ్రామంలో హిందూ ముస్లిం క్రైస్తవుల చేత పూజలు అందుకొంటున్న ఏకైక దర్గ గా బషీర్ బీబీ ఔలియా దర్గా ప్రసిద్ధి చెందింది..
అలాగే గొల్లప్రోలు మండలంలో కొడవలి గ్రామంలో రెండోవ శతాబ్దం నాటి బౌద్ధ స్థూపాలు, తాటిపర్తి గ్రామంలో అపర్ణాదేవి వంటి ఆలయాలు భక్తులుచే నిత్యం పూజులు అందుకుంటున్నాయి… పాదగయ క్షేత్రంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి వేడుకలు మూడు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తుంటారు.. ఇవి మాఘ మాసంలో ఫిబ్రవరి, మార్చి నెలలో జరుగుతుంటాయి…
అలాగే పురుహూతికా అమ్మవారికి చైత్రమాసంలో వసంత నవరాత్రులు, దేవి సరన్న నవరాత్రులు ఘనంగా జరుపుతుంటారు..ఇక కుంతీ మాధవ స్వామి ఆలయంలో ప్రతి ఏటా మాఘ పౌర్ణమి నాడు ఉత్సవాలు నిర్వహిస్తుంటారు.. ఈ ఫిబ్రవరి నెలలో జరుగుతుంటాయి.. ఇక శ్రీపాద శ్రీ వల్లభడు కి మార్గశర పౌర్ణమి నాడు డిసెంబర్ నెలలో దత్త జయంతి ఉత్సవాలు జరుపుకుంటారు.. అలాగే ఆంధ్ర బాప్టిస్ట్ సెంటినరీ చర్చ్ లో మార్చి నెలలో లెంట్ డేస్ డిసెంబర్ 25 న క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు..
అలాగే బషీర్ బీబీ హౌలియా దర్గాలో మాఘ మాసంలో శుక్ర శని ఆదివారాలలో ఉర్స్ ఉత్సవాలు నిర్వహిస్తారు వీటికి దేశం నలుమూలల నుంచి హిందూ ముస్లిం భక్తులు విచ్చేస్తుంటారు.. అలాగే గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో ఉన్న బౌద్ధ క్షేత్రంలో వైశాఖ మాసంలో బుద్ధ భగవానుడు జయంతి మే జూన్ నెలలో జరుగుతుంటుంది..
ఇక గొల్లప్రోలు అపర్ణాదేవి ఆలయంలో పాల్గొన శుద్ధ సప్తమి లో అపర్ణ అమ్మవారి కళ్యాణం జరుగుతుంది.. మార్గసర శుద్ధ షష్టికి సుబ్రహ్మణ్యస్వామి షష్టి కూడా ఈ ఆలయంలో ఘనంగా జరుగుతుంది.. ఇంతటి విశిష్టత ఆలయాలు కలిగిన పిఠాపురం నియోజకవర్గన్ని దర్శించేందుకు రోజు రోజుకి ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు.. పేరుకు తగ్గట్లుగా సంపూర్ణ ఏర్పాట్లు చేయాలని భక్తులు, స్థానికులు కోరుకుంటున్నారు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..