Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయవాడలో ఘరానా మోసం.. నకిలీ టాస్క్ ఫోర్స్ అధికారి అవతారమెత్తిన హోమ్ గార్డ్…

హోంగార్డు సుమన్ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ డబ్బులు ఏ విధంగానైనా సరే సంపాదించాలనే దురుద్దేశంతో గూగుల్లో కొంతమంది సర్పంచుల ఫోన్ నెంబర్లు సేకరించి వారి ద్వారా ఆ గ్రామంలో ఉన్న వైన్ షాపుల వివరాలు వారి ఫోన్ నెంబర్లు తెలుసుకున్నాడు. సదరు వైన్ షాప్ కు చెందిన వ్యక్తులకు ఫోన్లు చేసి వారి వద్ద నుండి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నాడు. ఇలా సుమారు..

విజయవాడలో ఘరానా మోసం.. నకిలీ టాస్క్ ఫోర్స్ అధికారి అవతారమెత్తిన హోమ్ గార్డ్...
Vijayawada Home Guard Scam
Follow us
P Kranthi Prasanna

| Edited By: Jyothi Gadda

Updated on: Jan 30, 2025 | 9:21 PM

బాపట్ల జిల్లా రేపల్లె చోడాయిపాలెం గ్రామానికి చెందిన చిక్కాల సుమన్ అను అతను 2006 సంవత్సరం నుండి హోంగార్డుగా పనిచేస్తు విధులు నిర్వహిస్తున్నాడు… అప్పటినుండి అతను అనేక మంది పోలీస్ అధికారుల వద్ద పనిచేసినట్లు కవరింగ్ ఇస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు… హోంగార్డ్ సుమన్ చెడు వ్యసనాలకు, క్రికెట్ బెట్టింగులకు అలవాటు పడి డబ్బును పోగొట్టుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు… ఇతగాడు ఈ మధ్యకాలంలో హోంగార్డు డిప్యూటేషన్ పై జి ఆర్ పి ఎఫ్ విజయవాడ లో విధులు నిర్వహిస్తున్నారు. ..

హోంగార్డు సుమన్ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ డబ్బులు ఏ విధంగానైనా సరే సంపాదించాలనే దురుద్దేశంతో గూగుల్లో కొంతమంది సర్పంచుల ఫోన్ నెంబర్లు సేకరించి వారి ద్వారా ఆ గ్రామంలో ఉన్న వైన్ షాపుల వివరాలు వారి ఫోన్ నెంబర్లు తెలుసుకున్నాడు. సదరు వైన్ షాప్ కు చెందిన వ్యక్తులకు ఫోన్లు చేసి వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తున్నాడు…

ఇటీవల కాలంలో మచిలీపట్నం తాళ్లపాలెం పంచాయతీలో గల వసుధ వైన్స్ కు ఫోన్ చేసి తాను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ నుండి మాట్లాడుతున్నట్లు తనకు 6000 రూపాయలు ఫోన్ పే చేయమని లేదంటే వారి షాపు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. వసుధ వైన్స్ యాజమాన్య నుండి వద్ద నుండి 6000 రూపాయలు ఫోన్ పే లో డబ్బులు తీసుకున్నాడు. మరల రెండవ రోజు సుమారు 9 గంటల ప్రాంతంలో సదరు హోమ్ గార్డ్ పనిమీద మచిలీపట్నం వచ్చి వసుధ వైన్స్ యాజమానికి ఫోన్ చేసి డబ్బులు అడిగాడు అయితే తన అకౌంట్లో డబ్బులు లేవని కాష్ మాత్రమే ఉన్నదని చెప్పి క్యాష్ చేతికి ఇస్తానని హోంగార్డును బీచ్ రోడ్ లో గల ఎస్వీహెచ్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్దకు రమ్మని చెప్పాడు… వసుధా వైన్స్ యజమానికి అనుమానం వచ్చి పోలీసు వారికి సమాచారం ఇచ్చారు. పోలీసులు వసుధ వైన్స్ యాజమాని ఇచిన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసి హోంగార్డు ను రిమాండ్ కి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..