CSIR UGC NET 2024 Exam Date: సీఎస్‌ఐఆర్- యూజీసీ నెట్ పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. ఎప్పట్నుంచంటే?
సీఎస్‌ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ డిసెంబర్-2024 పరీక్షకు సంబంధించిన షెడ్యూ్‌ల్‌ను ఎన్‌టీఏ తాజాగా వెల్లడించింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు మొత్తం 3 రోజుల పాటు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ విధానంలో రోజుకు రెండు షిఫ్టుల్లో జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఈ కింద చెక్ చేసుకోవచ్చు..

హైదరాబాద్, జనవరి 31: జాయింట్ సీఎస్‌ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ డిసెంబర్-2024 పరీక్ష తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్లడించింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. సీఎస్‌ఐఆర్- యూజీసీ నెట్ పరీక్షలు ఫిబ్రవరి 28, మార్చి 1, 2వ తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో జరగనున్నాయి. పరీక్షకు మూడు రోజుల ముందు నుంచి అడ్మిట్ కార్డులు అందుబాటులోకి తీసుకువస్తారు. సైన్స్ విభాగాల్లో పరిశోధన, బోధనకు అవకాశం కల్పించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రతీయేట ఈ పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
సైన్స్ సబ్జెక్టుల్లో పరిశోధనలకు అవకాశం కల్పించే జేఆర్‌ఎఫ్‌తో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ పరీక్షలో అర్హత సాధించవల్సి ఉంటుంది. ఈ పరీక్ష ద్వారా జేఆర్‌ఎఫ్ అర్హత పొందితే సీఎస్‌ఐఆర్ పరిధిలోని రిసెర్చ్ సెంటర్లలో, యూనివర్సిటీల్లో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే దేశంలోని ఏ యూనివర్సిటీ లేదా కాలేజీలోనైనా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కొలువు దక్కించుకునేందుకు అర్హత సాధించవచ్చు.
సీఎస్‌ఐఆర్- యూజీసీ నెట్ పరీక్షల షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ముగిసిన ఏపీ ఇంటర్ పబ్లిక్ పరీక్ష ఫీజు చివరి గడువు.. ఇక ప్రిపరేషన్ షురూ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంటర్ విద్యార్ధులకు ఈ ఏడాది మార్చిలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపుల గడువు జనవరి 30వ తేదీతో ముగిసింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే దాదాపు అన్నా కాలేజీల విద్యార్ధులు ఫీజులు చెల్లించారు. ఇక మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, మార్చి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. దీంతో విద్యార్ధులందరూ ముమ్మరంగా ప్రిపరేషన్ సాగిస్తున్నారు. ప్రత్యేకంగా క్లాస్‌లను ఏర్పాటు చేసి ఉపాధ్యాయులు విద్యార్ధులను చదివిస్తున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.