AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan East Godavari Tour : శనివారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్న జనసేనాని..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. తొండంగి మండలంలో దివీస్‌ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మత్స్యకారులు..

Pawan Kalyan East Godavari Tour : శనివారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్న జనసేనాని..
Rajeev Rayala
|

Updated on: Jan 08, 2021 | 1:14 PM

Share

Pawan Kalyan East Godavari Tour : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. తొండంగి మండలంలో దివీస్‌ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మత్స్యకారులు, అక్కడి ప్రజలకు మద్దతుగా నిలిచేందుకు పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నట్లు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కందుల దుర్గేష్ మీడియాకు తెలిపారు. జనసేనాని ఈ నెల 9 న (శనివారం) మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నవరం చేరుకొని అక్కడి నుంచి ర్యాలీగా దివీస్‌ పరిశ్రమ ఏర్పాటు  ప్రాంతానికి పవన్ చేరుకుంటారని…అక్కడి పరిస్థితులు పరిశీలించిన అనంతరం తొండంగి మండలం కొత్తపాకలు గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నట్లు తెలిపారు. ఇక పవన్ పర్యటనకు పోలీసుల అనుమతి తీసుకున్నామని, అభిమానులు కార్యకర్తలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు, ధరించి దూరం పాటించాలని కందుల దుర్గేష్ కోరారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

బోయిన్‌పల్లి కిడ్నాప్ మాస్టర్ మైండ్ అతడే.. భార్గవ్ రామ్‌కు రైట్‌హ్యాండ్‌, అఖిలప్రియ కుటుంబానికి నమ్మదగ్గ వ్యక్తి.!

Sanjay Dutt: కేజీఎఫ్‌-2లో అంతకు మించి యాక్షన్‌.. తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన బాలీవుడ్ హీరో..