Golden Bhagavad Gita: కర్ణాటక ఉడిపిలోని పుత్తిగ మఠాధిపతి సుగుణేంద్ర తీర్థ స్వామీజీకి ఒక భక్తుడు బంగారు రేకులపై ముద్రించిన భగవద్గీత పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు. బంగారం ధరలు పెరిగిన ప్రస్తుత తరుణంలో, భగవద్గీత వంటి పవిత్ర గ్రంథాన్ని బంగారు రేకులపై ముద్రించి ఇవ్వడం ఒక అద్భుతమైన, ప్రత్యేకమైన కానుకగా మారింది. ఇది సర్వత్రా చర్చనీయాంశంగా నిలుస్తోంది.