బోయిన్‌పల్లి కిడ్నాప్ మాస్టర్ మైండ్ అతడే.. భార్గవ్ రామ్‌కు రైట్‌హ్యాండ్, అఖిలప్రియ కుటుంబానికి నమ్మదగ్గ వ్యక్తి.!
హఫీజ్‌పేట్ భూ వ్యవహారంలో కిడ్నాప్ ముఠా నాయకుడు గుంటూరు శ్రీను అని తెలుస్తోంది. గుంటూరుకు చెందిన మాడాల శ్రీను, భూమ అఖిల..
హఫీజ్‌పేట్ భూ వ్యవహారంలో కిడ్నాప్ ముఠా నాయకుడు గుంటూరు శ్రీను అని తెలుస్తోంది. గుంటూరుకు చెందిన మాడాల శ్రీను, భూమ అఖిలప్రియ కుటుంబ వ్యవహారాలను అన్నీ తానై నడిపిస్తాడని సమాచారం. నంద్యాల ఉపఎన్నికలోనూ గుంటూరు శ్రీనే కీలకంగా వ్యవహరించాడు. కాగా, శ్రీను లగ్జరీ జీవితంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సరదాలకు హెలికాప్టర్లు, విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తోన్న గుంటూరు శ్రీను, బోయిన్ పల్లి కిడ్నాప్ ఎలా చేయాలి, ఎలా వెళ్లాలి తదితర స్కేచ్ తనే గీసినట్టు భావిస్తున్నారు.
సినీపక్కీలో కిడ్నాప్‌కు శ్రీను ప్లాన్ చేశాడు. శ్రీను సలహామేరకు ముఠా సభ్యులు కృష్ణానగర్ సమీపంలోని శ్రీనగర్ కాలనీలో ఉండే డ్రామా డ్రెస్ కంపెనీ లో ఐటీ అధికారుల డ్రెస్‌లను అద్దెకు తీసుకున్నట్టు తేలింది. భార్గవరామ్‌కు రైట్‌హ్యాండ్‌గా, అఖిలప్రియ కుటుంబానికి నమ్మదగ్గ వ్యక్తిగా శ్రీను వ్యవహరిస్తూ వస్తున్నట్టు తెలుస్తోంది. భూమా ఫ్యామిలీకీ, భార్గవ్ రామ్ కు కీలక అనుచరుడుగా వ్యవహరిస్తున్న మాడాల శ్రీను నేరచరిత్రపై ఇప్పుడు టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు.