Alludu Adhurs : ఒక్క రోజు ముందే ప్రేక్షకుల ముందుకు రానున్న బెల్లంకొండ ‘అల్లుడు అదుర్స్’..?

బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సంక్రాంతికి అల్లుడు అదుర్స్ అంటూ సందడి చేయనున్న విషయం తెలిసిందే. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నభనటేష్..

Alludu Adhurs : ఒక్క రోజు ముందే ప్రేక్షకుల ముందుకు రానున్న బెల్లంకొండ 'అల్లుడు అదుర్స్'..?
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 08, 2021 | 1:00 PM

Alludu Adhurs : బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సంక్రాంతికి ‘అల్లుడు అదుర్స్’ అంటూ సందడి చేయనున్న విషయం తెలిసిందే. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నభనటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 15న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాను కాస్త ముందుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నరట. ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీనే ఉంది.

మాస్ రాజా రవితేజ ‘క్రాక్’ సినిమా తో వస్తుంటే.. యంగ్ హీరో రామ్ ‘రెడ్’ సినిమాతో సిద్ధంగా ఉన్నాడు. అయితే రవితేజ సినిమా అందరికంటే ముందు అంటే జనవరి 9న విడుదల కానుంది. దాంతో ‘అల్లుడు అదుర్స్’ కూడా ముందుగానే తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. రామ్ నటిస్తున్న ‘రెడ్’ మూవీని జనవరి 14న విడుదల చేస్తున్నారు చిత్రయూనిట్. అదే రోజు ‘అల్లుడు అదుర్స్’ కూడా రిలీజ్ కానుందని తెలుస్తుంది. కానీ ఇంకా ‘అల్లుడు అదుర్స్’ ప్రీపోస్టుపోన్ గురించి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఈ వారంలో ఎప్పుడైనా రిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశం ఉందని ఫిలింనగర్ లో టాక్ నడుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Actress Shilpa Vaccinated: కరోనా వైరస్ కు టీకా వేయించుకున్న తొలి బాలీవుడ్ నటిగా నిలిచిన మహేష్ బాబు వదిన

Amitabh Bachchan : అమితాబ్ వాయిస్‌ను తొలగించండి.. కోర్టును ఆశ్రయించిన సామాన్యుడు