చెవులను శుభ్రం చేయడానికి సాధారణంగా ఇయర్ బడ్స్, కాటన్ స్వాబ్లు వాడుతుంటాం. అయితే, ఇవి చెవులకు హాని చేస్తాయని, వ్యాక్స్ను లోపలికి నెట్టి, వినికిడి లోపానికి, ఇన్ఫెక్షన్లకు దారి తీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, సొంతంగా శుభ్రం చేసుకోకుండా, సమస్యలుంటే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.