Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanjay Dutt: కేజీఎఫ్‌-2లో అంతకు మించి యాక్షన్‌.. తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన బాలీవుడ్ హీరో..

sanjay Dutt About Kgf-2: ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్‌ హీరోగా తెరకెక్కిన 'కేజీఎఫ్‌' ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న కేజీఎఫ్‌-2 టీజర్‌ తాజాగా విడుదలై...

Sanjay Dutt: కేజీఎఫ్‌-2లో అంతకు మించి యాక్షన్‌.. తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన బాలీవుడ్ హీరో..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 08, 2021 | 1:09 PM

sanjay Dutt About Kgf-2: ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్‌ హీరోగా తెరకెక్కిన ‘కేజీఎఫ్‌’ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కేజీఎఫ్‌-2 టీజర్‌ తాజాగా విడుదలై నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఇక కేజీఎఫ్‌ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవడానికి ప్రధాన కారణాల్లో ఇందులోని యాక్షన్‌ సన్నివేశాలు ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు వస్తోన్న సీక్వెల్‌ చిత్రంలో అంతకు మించిన యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయట. ఈ విషయాన్ని చెబుతోంది ఎవరో కాదు.. రాఖీ భాయ్‌తో పోటీపడనున్న అధీరా.. అదేనండి ఆ పాత్రలో నటిస్తోన్న సంజయ్‌ దత్‌. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మీడియాతో మాట్లాడిన సంజయ్‌ దత్‌ పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. అధీరా పాత్రను తాను చాలా ఎంజాయ్‌ చేస్తూ చేశానని చెప్పుకొచ్చాడు సంజయ్‌. ఇక ‘కేజీఎఫ్‌1’కు మించి ఇందులో యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయని. యాక్షన్‌ సన్నివేశాలను ప్రేక్షకులు వెండితెరపై చూడాల్సిందే అంతకు మించి వాటి గురించి ఏం చెప్పలేమని పేర్కొన్నాడు. ఇక అధీరా పాత్ర కోసం మెకప్‌ వేసుకోవడానికే సంజయ్‌ దత్‌కు గంటన్నర సమయం పట్టిదంట. ఇన్ని అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలకు తెర తీస్తుందో చూడాలి.

Also Read: Amitabh Bachchan : అమితాబ్ వాయిస్‌ను తొలగించండి.. కోర్టును ఆశ్రయించిన సామాన్యుడు