Actress Shilpa Vaccinated:కరోనా వైరస్ కు టీకా వేయించుకున్న తొలి బాలీవుడ్ నటిగా నిలిచిన మహేష్ బాబు వదిన
తాజాగా దుబాయ్ కూడా వ్యాక్సిన్ డ్రైవ్ ను నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో దుబాయ్ లో నివశిస్తున్న ప్రముఖ సీనియర్ నటి శిల్పా శిరోద్కర్ వ్యాక్సిన్ వేయించుకుంది. దీంతో కరోనా వైరస్ కు టీకా వేయించుకున్న తొలి బాలీవుడ్ నటిగా..
Actress Shilpa Vaccinated: ఏడాదికి పైగా ప్రపంచదేశాల్లో కల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్ ను తరిమికొట్టడానికి తయారు చేసిన వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని దేశాలు టీకా డ్రైవ్ ను వివిధ దశల్లో చేస్తున్నాయి. తాజాగా దుబాయ్ కూడా వ్యాక్సిన్ డ్రైవ్ ను నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో దుబాయ్ లో నివశిస్తున్న ప్రముఖ సీనియర్ నటి శిల్పా శిరోద్కర్ కోవిడ్ 19 టీకా తీసుకుంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
వ్యాక్సిన్ వేసిన చేతిని చూపిస్తూ శిరోద్కర్ సెల్ఫీని పోస్ట్ చేసింది. అంతేకాదు ఫొటోతో పాటు వ్యాక్సిన్ వేయించుకోవడం సురక్షితం.. మళ్ళీ సాధారణ జీవితానికి మనం వెళ్ళవచ్చు.. తనకు టీకా వేసిన యుఎఇ ప్రభుత్వానికి కృతఙ్ఞతలు అని కామెంట్ జత చేసింది. కరోనా వైరస్ కు టీకా వేయించుకున్న తొలి బాలీవుడ్ నటిగా నిలిచింది మహేష్ బాబు వదిన.. శిల్పా శిరోద్కర్.
Also Read: మనం కాదనుకున్న పూర్వకాలం అలవాట్లే శ్రేయస్కరమా.. రాగినీటితో రోగాలు దూరం