Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Copper Water Bottle Benefits: మనం కాదనుకున్న పూర్వకాలం అలవాట్లే శ్రేయస్కరమా.. రాగినీటితో రోగాలు దూరం

వెనుకటి తరంవారు రాగి పాత్రలు ఇంట్లో ఉంటే రోగాలు రావు అనేవాళ్లు. ఎవరైనా అతిధులు ఇంటికి రాగానే రాగి చెంబుతో తాగడానికి నీరు ఇచ్చేవారు. రాత్రంతా రాగిపాత్రలో నిల్వ చేసిన నీటిని ఉదయాన్నే తాగితే..

Copper Water Bottle Benefits: మనం కాదనుకున్న పూర్వకాలం అలవాట్లే శ్రేయస్కరమా.. రాగినీటితో రోగాలు దూరం
Follow us
Surya Kala

|

Updated on: Jan 08, 2021 | 11:49 AM

Copper Water Bottle Benefits ప్రస్తుతం మానవాళిపై వైరస్ లు వరసగా దాడి చేస్తున్నాయి. రోజుకొక కొత్త వ్యాధి పుట్టుకొస్తుంది. మారుతున్న కాలంతో పాటే మనుషుల అలవాట్లు మారాయి. పూర్వీకులు వాడే రాగి, మట్టి పాత్రల ప్లేస్ లో ప్లాస్టిక్ , నాన్ స్టిక్ వంటివి చేరుకున్నాయి. దీంతో మనుషులు వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే వీటికి చక్కటి పరిష్కారం చూపిస్తున్నాయి రాగి పాత్రలు. పూర్వ కాలంలో రాగి తో తయారు చేసిన వస్తువులను ఎక్కువగా ఉపయోగించేవారు. అందుకనే మన పూర్వీకులు ఆరోగ్యంగా జీవించేవారు. రాగి పాత్రల్లో వంటల తయారీ, భోజనం చేయడం ఆరోగ్యకరమైన విషయాలని మన పెద్దలు చెప్పేవారు. ఆ విషయాన్ని నిజం చేస్తూ ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ రాగి, ఇత్తడి మిశ్రమంతో తయారుచేసిన వస్తువులపై నిమిషాల్లోనే చనిపోతుందని సౌతాంప్టన్‌ యూనివర్సిటీలోని ఎన్విరాన్‌మెంటల్‌ హెల్త్‌కేర్‌ విభాగం ప్రొఫెసర్‌ బిల్‌ కీవిల్‌ తెలిపారు. అంతేకాదు నీటిలో ఉన్న బ్యాక్టీరీయాను తరిమికొట్టి సహజసిద్ధంగా శుద్ధి చేసే గుణం రాగి సొంతం అని చెప్పారు. రాగి పాత్రలో నీరు తాగితే బ్యాక్టీరియా, ఫంగస్ వంటి మైక్రో ఆర్గానిజం దరిచేరదని పరిశోధనలు తేల్చాయి. అందుకే వెనుకటి తరంవారు రాగి పాత్రలు ఇంట్లో ఉంటే రోగాలు రావు అనేవాళ్లు. ఎవరైనా అతిధులు ఇంటికి రాగానే రాగి చెంబుతో తాగడానికి నీరు ఇచ్చేవారు.

రాత్రంతా రాగిపాత్రలో నిల్వ చేసిన నీటిని ఉదయాన్నే తాగితే శరీరంలోని విషపదార్థాలు బయటకెళ్లిపోతాయని కూడా వైద్యనిపుణులు చెప్పారు. రాగి మన శరీరానికి కావల్సిన ముఖ్య ధాతువు. అలా రాగి పాత్రలో నిలువ చేసిన నీటి ద్వారా మన శరీరానికి అవసరమ్యే ఖనిజం అందడమే కాకుండా, రాగి వల్ల ప్రభావితమైన నీటి వల్ల అనేక రకాల మేలు కలుగుతుందంటోంది ఆయుర్వేదం. రాత్రిపూట రాగి పాత్రలో నీటిని ఉంచి ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగడం మంచిది. రాగి పాత్రలోని నీగికి త్రిదోషాలనూ (పిత్తం, వాతం, కఫం) పరిహరించే గుణం ఉందని ఆయుర్వేదం చెబుతోంది. ఈ త్రిదోషాలూ కనుక సమతుల్యంగా ఉంటే సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లే! రాగికి యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. వీటిని ఆయుర్వేదాల తయారీలో పూర్వ కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. మీరు 8 లేదా అంతకంటే ఎక్కువ గంటలు రాగి పాత్రలలో నీటిని నిల్వ చేస్తే, ఆ నీటిలోని అన్ని రకాల ప్రమాదకర సూక్ష్మజీవులు నశిస్తాయి. రోజూ రాగిపాత్రలో నీరు తాగే వారికీ జాండీస్‌, డయేరియా వంటి వ్యాధులు సోకవు. జీర్ణ శక్తికి తోడ్పడటంలోనూ, శరీరంలో ఉన్న మలినాలను తొలగించడంలోనూ రాగి నీరు అత్యంత ప్రభావవంతమని ఆయుర్వేదం చెబుతోంది.

ఎసిడిటీ, అల్సర్‌ వంటి జీర్ణ సంబంధ వ్యాధుల నుంచి కూడా రాగి పాత్రలోని నీరు ఉపశమనాన్ని అందిస్తుందట. బరువు తగ్గాలనుకునేవారికి రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు అత్యంత శ్రేయస్కరమని పెద్దల ఉవాచ. ఆ నీటికి కొవ్వు కణాలను సైతం విడగొట్టే శక్తి ఉందట. రాగినీటి వల్ల మెలనిన్‌ ఉత్పత్తి మెరుగుపడుతుండి. దీని వల్ల మన చర్మం, కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. జుత్తు తెల్లబడే సమస్య ఉండదు. రాగి నీటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ల వల్ల వృద్ధాప్యం మన దరి చేరదంటున్నారు. విటమిన్ ‘డి’ లోపమే కాకుండా శరీరంలో కాపర్ లోపం కూడా ఎముకల సాంద్రతను ప్రభావితం చేస్తాయి. శరీరంలో తగినంత కాపర్ లేకపోతే ఒక వ్యక్తి ఎముకల వ్యాధి బారిన పడే అవకాశం ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే రాగి నీరు ఆర్థరైటిస్‌ను అదుపులో ఉంచడమే కాకుండా ఇమ్యూన్‌ సిస్టంను బలోపేతం చేసి ఎములకు బలాన్నిస్తుంది.

రాగినీటి ద్వారా మన శరీరానికి అందే ‘ఫాస్పోలిపిడ్స్‌’ మెదుడు పనితీరుని మెరుగుపరుస్తాయి. మెదడులోని సమాచార వ్యవస్థకు, జ్ఞాపకశక్తికి ఇవి దోహదపడతాయి. మూర్ఛ వ్యాధి ఉన్నవారిలో ఆరోగ్యం మెరుగుపడేందుకు సాయపడతాయి. గుండె సమస్యలు, క్యాన్సర్‌ రాకుండా చేయడంలో, శరీరం బరువు తగ్గించడంలో, గాయాలు తగ్గించడంలో రాగి ముఖ్యపాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా థైరాయిడ్‌, రాగితో చేసిన గాజులను ధరించడం వలన ఇస్నోమియా, న్యూరోసిస్‌, అధిక రక్తపోటు వంటి వాటిని కూడా నియంత్రించుకోవచ్చని నిపుణులు సెలవిస్తున్నారు.

ఇలా చెప్పుకుంటూ పోతే రాగినీటితో ప్రయోజనాలు చాలానే కనిపిస్తాయి. కీళ్లనొప్పులు మొదల్కొని థైరాయిడ్‌ వరకూ ఎన్నో ఆరోగ్య సమస్యలలో రాగి నీరు ప్రభావవంతంగా పనిచేస్తుందని సనాతన వైద్యం చెబుతోంది. అయితే రాగి పాత్రను శుభ్రంగా తోమకుంటే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. అపరిశుభ్రమైన రాగి పాత్ర మీద పేరుకునే క్రియులు వాంతులు, విరేచనాలకు దారి తీయవచ్చు. అలాగే తాగమన్నారు కదా అని అవసరానికి మించి రాగి నీటిని పట్టించినా, మన శరీరంలో మోతాదుకి మించి రాగి పేరుకునే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు .

Also Read: ప్రపంచ దేశాల్లో కరాళ నృత్యాన్ని కొనసాగిస్తోన్న కోవిడ్, 9 కోట్లకు చేరుకుంటున్న బాధితుల సంఖ్య