SLBCలో రెస్క్యూ ఆపరేషన్ 27వ రోజు.. ఇవి లేటెస్ట్ అప్ డేట్స్
SLBCలో రెస్క్యూ ఆపరేషన్ 27 వ రోజు కూడా ఆ ఏడుగురి ఆచూకీపై స్పష్టత రాలేదు. మరోవైపు ఎండ్ పాయింట్ అత్యంత ప్రమాదకరంగా మారింది. భయం భయంగానే ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్. ఇప్పటి వరకు ఆపరేషన్ పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట SLBC టన్నెల్‌లో రెస్కూ ఆపరేషన్ శరవేగంగా కొనసాగుతోంది. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన డీ2, డీ1 ప్రదేశాల్లో రెండు మినీ జేసీబీలతో తవ్వకాలు చేపట్టారు. పేరుకుపోయిన బురద మట్టి, టీబీఎం శకలాలను తొలగిస్తూ కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు పంపించారు. ఏడుగురి ఆచూకీ కోసం రెస్క్యూటీమ్ తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి.
TBM మిషన్ అడుగు భాగం వరకు తవ్వినా ఆ ఏడుగురికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. మరోవైపు టన్నెల్‌లో ఎండ్ పాయింట్ సమీప ప్రాంతం ప్రమాదకరంగా మారింది. తవ్విన కొద్దీ పెరుగుతోన్న నీటి ఊటతో పాటు ఎండ్ పాయింట్ నుంచి 50 మీటర్ల ముందు వరకు ..పైకప్పు ప్రమాదకరంగా మారింది.చివరి 30 మీటర్లలో రాళ్లు, మెత్తని మట్టిని కదిలిస్తే నీటి ఊట పెరుగుతుందని..పైకప్పు కూడా కూలే అవకాశం వుందని రెస్క్యూ టీమ్స్ సైతం హడలిపోతున్నాయి. రోబోతోపాటు ప్రత్యేక యంత్రాల ద్వారా తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎంత లోతుకు తవ్వితే వారి ఆచూకీ బయట పడుతుందో అంచనా అందడంలేదు. ఆశలు సన్నగిల్లుతున్నా సరే అవిశ్రాంతంగా ముందుకు సాగుతున్నాయి రెస్క్యూ టీమ్స్. దాదాపు ఎండ్ పాయింట్ 50 మీటర్ల చేరువకు చేరిన రెస్క్యూ టీమ్స్‌కు ..ఇప్పుడు ఆ 30 మీటర్ల ఆ దూరమే అత్యంత డేంజర్ గా మారింది. భయం భయంగానే సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.పైనుంచి మరోసారి మట్టి కుప్పకూలే ప్రమాదం ఉండటంతో టెన్షన్ పడుతున్నారు. NDRF,SDRF, ఆర్మీ,నేవీ రైల్వే సహా సింగరేణి టీమ్స్ సెర్చ్ ఆపరేషన్స్‌ను స్పీడప్ చేశాయి.