TOP 9 ET News: జక్కన్నే చెప్పాడంటే.. ఇక మహేష్ ఫ్యాన్స్ సల్లబడ్డట్టే
స్టార్ హీరో ఫ్యాన్స్ సెన్సెటివ్‌గా ఉంటారబ్బా..! వాళ్ల హీరోల విషయంలో, ప్రతీ చిన్న దానికి ఫీలవుతుంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఇప్పుడో విషయంలో ఫీలవుతూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. అదేంటంటే..! జక్కన్న డైరెక్షన్లో మహేష్ చేస్తున్న సినిమాకు మొదల వర్కింగ్ టైటిల్‌గా SSMB29 అని పేరు పెట్టారు. కానీ ఆ తర్వాత ఈ వర్కింగ్ టైటిల్ SSRMB మార్చినట్టు నెట్టింట వార్తలు వచ్చాయి.
ఇది చిన్న విషయమే అయినా కొంద మంది ఫ్యాన్స్ ఈ విషయంలో ఫీలయ్యారు. వర్కింగ్ టైటిల్ మార్చడం ఏంటంటూ పోస్టులు పెట్టారు. కానీ తాజాగా ఆ ట్యాగ్ మార్చలేదని తేలిపోయింది. తాజాగా ఒరిస్సా అడవుల్లో షూట్ ఫినిష్ చేసిన జక్కన్న అక్కడి లోకల్ పీపుల్‌కు థాంక్స్ చెబుతూ ఓ నోట్ రాశారు. అందులో ఆయనే స్వయంగా SSMB29గా కోట్ చేశాడు. దీంతో మహేష్ ఫ్యాన్స్ సల్లబడ్డారు. బాలీవుడ్‌లో సగం మందికి పైగా స్టార్ సెలబ్రిటీలు.. 40 నుంచి 50 కోట్లకు పైగా ఖర్చు! ఇదంతా దేనికి అంటారా? ఐపీఎల్ 2025 వేడుక కోసం! ఎస్ ! ఐపీఎల్ 2025 మార్చ్ 22 నుంచి ప్రారంభం కాబోతోంది. తొలి మ్యాచ్ కోల్ కత్తా ఈడెన్ గార్డెన్స్‌లో కొల్ కత్తా వర్సెస్ బెంగుళూరు మధ్య జరగబోతోంది. ఇక ఈ మ్యాచ్ ముందు జరిగే కర్టన్ రైజ్ వేడుకల కోసం దిమ్మతిరిగే రేంజ్‌లో భారీగా ఏర్పాట్లు చేశారు ఐపీఎల్ నిర్వాహకులు. ఇందుకోసం సంగం బాలీవుడ్ స్టార్లను గ్రౌండ్‌లోకి దించనున్నారు. ఈ సారి షారుఖ్‌తో పాటు సల్మాన్ ఖాన్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. దీంతో ఈ వేడుక మీదే ఇప్పుడందరి చూపుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Puri Jagannadh: వావ్! పూరీకి హీరో దొరికేశాడోచ్
బెట్టింగ్ యాప్ కేసులో ED ఎంట్రీ! తీవ్ర చిక్కుల్లో ఆ 11 మంది
Tasty Teja: పోలీసులకు షాకిచ్చిన టేస్టీ తేజ
Nayanthara: దారుణంగా తిట్టి అవమానించాడు…స్టార్ డైరెక్టర్ పై నయన్ తీవ్ర ఆరోపణలు