Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఇలాంటి వాళ్లకు దూరంగా ఉంటేనే సేఫ్..!
ఆచార్య చాణక్యుడు భారతీయ చరిత్రలో గొప్ప తెలివైన ఆచార్యుడిగా ప్రసిద్ధి చెందారు. ఆయన చెప్పిన నీతి సూత్రాలు నేటికీ ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. వ్యక్తిగత జీవితం, కుటుంబ సంబంధాలు, సమాజంలో ఎలా జీవించాలో ఆయన బోధనల్లో వివరించారు. కొన్ని లక్షణాలు ఉన్న ఆడవాళ్లతో దూరంగా ఉండాలని సూచించారు.

ఆచార్య చాణక్యుడు బుద్ధిమంతుడు, నైతిక విలువలతో ప్రాచీన భారతదేశానికి గొప్ప మార్గదర్శకుడిగా నిలిచాడు. ఆయన చెప్పిన నీతి సూత్రాలు జీవితాన్ని విజయవంతంగా కొనసాగించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. నేటికీ ఆయన బోధనలను అనేక మంది అనుసరిస్తున్నారు. చాణక్యుడు మగవారి గురించి మాత్రమే కాకుండా.. ఆడవాళ్ల లక్షణాల గురించి కూడా తన నీతి గ్రంథాలలో వివరించాడు. కొన్ని రకాల లక్షణాలు కలిగిన ఆడవాళ్లు వ్యక్తిగత జీవితానికి, కుటుంబ సంబంధాలకు, సమాజానికి హానికరంగా మారవచ్చని ఆయన చెప్పాడు. అలాంటి మహిళలతో జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. మరి చాణక్యుడి నీతి ప్రకారం ఎలాంటి మహిళలతో దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చెవిలో వెంట్రుకలు
చాణక్యుడి మాటల ప్రకారం చెవిలో ఎక్కువ వెంట్రుకలు ఉన్న మహిళలు ఇంట్లో గొడవలకు కారణమవుతారని చెబుతారు. అలాగే సరైన ఆకారంలో లేకుండా ఉండే చెవులు కలిగిన వారు కుటుంబ జీవితంలో కలహాలకు దారితీయవచ్చని ఆయన సూచించారు. అదేవిధంగా ముందుకు విరిగి కనిపించే పళ్లను కలిగిన మహిళలు జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుందని చాణక్యుడు తెలిపాడు.
పసుపు రంగు కళ్లు
చాణక్యుడి సిద్ధాంతాల ప్రకారం పసుపు రంగు కళ్లున్న ఆడవాళ్లు సహజంగా భయపడే స్వభావం కలిగి ఉంటారు. కొంతమంది కోపం ఎక్కువగా ప్రదర్శించవచ్చు. ఈ లక్షణాలు కుటుంబ శాంతికి హాని కలిగించేలా ఉండొచ్చు. అయితే బూడిద రంగు కళ్లున్న వారు మృదుస్వభావం కలవారని, మంచితనంతో వ్యవహరిస్తారని ఆయన పేర్కొన్నారు.
చేతులపై టాటూలు
చాణక్యుడి గ్రంథాల ప్రకారం నవ్వేటప్పుడు బుగ్గలు ఉబ్బే మహిళలు మంచివారు కారని చెబుతారు. చేతులపై గట్టిగా కనిపించే రక్తనాళాలు, అసమతుల్యమైన చేతి ఆకారం ఉన్న మహిళలు జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారని సూచించారు. ముఖ్యంగా చేతులపై కాకులు, గుడ్లగూబలు, పాములు, తోడేళ్ల టాటూలు వేయించుకున్న వారు ఇతరులకు హాని చేసే అవకాశం ఉందని చాణక్యుడు హెచ్చరించారు.
చిన్న మెడ
చాణక్యుడి ప్రకారం చిన్న మెడ కలిగిన ఆడవాళ్లు ఎక్కువగా ఇతరులపై ఆధారపడే స్వభావం కలిగి ఉంటారు. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల వీరు జీవితంలో ఎదగలేరు. పొడవాటి మెడ కలిగిన వారు దురదృష్టాన్ని తెచ్చిపెట్టవచ్చని, చదునుగా ఉన్న మెడ గలవారు ఎక్కువగా కోపాన్ని ప్రదర్శించే లక్షణం కలిగి ఉంటారని చాణక్యుడు తన గ్రంథాల్లో పేర్కొన్నాడు.
చాణక్య నీతి
చాణక్యుడు తన నీతి గ్రంథాల్లో మంచివారితోనే సంబంధాలు కలిగి ఉండాలని.. జీవితాన్ని శాంతియుతంగా కొనసాగించేందుకు కొన్ని నియమాలను పాటించాలని చెప్పాడు. హాని కలిగించే వ్యక్తులను గుర్తించి వారితో సంబంధాలు తగ్గించుకోవడం మంచిదని ఆయన తన బోధనల్లో వివరించాడు.
(ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది)