కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలిపి తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

20 March 2025

TV9 Telugu

TV9 Telugu

ఎండకు గొంతు తడారిపోతోంది.. అలాంటప్పుడు ఠక్కున గుర్తుకొచ్చేవి కూల్‌ డ్రింక్స్‌. థమ్స్‌అప్, పెప్సీ, కోకాకోలా, లిమ్కా  వంటి పానీయాలు వైపే మొగ్గు చూపుతాం 

TV9 Telugu

కానీ అవి తాగినప్పుడు బాగానే ఉన్నా మళ్లీ కాసేపటికే దప్పిక వేస్తుంది. కూల్‌డ్రింక్స్‌లా కాకుండా సహజసిద్ధంగా దొరికే పానీయాల్లో కొబ్బరి బోండాం నీళ్లు ఎంతో శ్రేష్ఠమైనవి. ఎలాంటి రసాయనాలు లేకుండా ఉండటంతో ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది

TV9 Telugu

అంతేకాకుండా కొబ్బరి నీళ్లు ఒక సహజ ఎలక్ట్రోలైట్. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. ఇది కాకుండా కొబ్బరి నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

TV9 Telugu

అయితే కొబ్బరి నీళ్ళలో నిమ్మకాయ కలిపి ఎప్పుడైనా తాగారా? నిజానికి.. నిమ్మరసం, కొబ్బరి నీళ్ళు కలిపి తాగడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు

TV9 Telugu

నిమ్మరసం, కొబ్బరి నీళ్ళు కలిపి తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెరను నియంత్రించడంలో కూడా ఇది సహాయపడుతుంది

TV9 Telugu

నిమ్మరసం, కొబ్బరి నీళ్ళు కలిపి తాగడం వల్ల టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మాన్ని సహజంగా ప్రకాశవంతంగా చేస్తుంది

TV9 Telugu

కొబ్బరి నీరు బరువు నియంత్రణకు ప్రయోజనకరంగా ఉంటాయి. నిమ్మకాయ రసం కలిపిన కొబ్బరి నీరు శరీరం నుంచి విషాన్ని బయటకు పంపుతుంది. ఇది మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది

TV9 Telugu

నిమ్మ రసం కలిపిన కొబ్బరి నీళ్లు కొంతమందికి గుండెల్లో మంటను కలిగిస్తాయి. కాబట్టి అధిక రక్తపోటు, అలెర్జీలు ఉన్నవారు దీనిని తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి