Excessive Sweat: తలలో చెమటలు ఎక్కువగా పడుతున్నాయా.. మీలో ఈ లోపం ఉన్నట్టే..
ఎండాకాలంలో ఒంటి మీదనే కాదు చాలా మందికి తలలోంచి చెమటలు కారిపోతుంటాయి. ఇది చిన్న సమస్యగానే అనిపించినా నలుగురిలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందిపెట్టేస్తుంది. తలమీద జుట్టు లేని కారణంగానో, ఎండ వల్లనో ఇలా జరుగుతుందని అనుకుంటే ఇది అన్నిసార్లు సరైంది కాకపోవచ్చు. ఎందుకంటే కొన్ని సార్లు ఇది మీ శరీరంలో లోపాలను చెప్పే సంకేతం కూడా కావచ్చు. అదేంటో మీరూ తెలుసుకోండి..

అసలే ఎండాకాలం.. చెమటలు పట్టడం అనేది ఎంతో సహజమైన సమస్య. అయితే కొందరిలో అదే పనిగా తల లోంచి చెమటలు నీళ్లు ధార పోసినట్టుగా కారుతుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందని చాలా మంది ఆలోచించరు. ముఖ్యమైన మీటింగ్స్ లో ఉన్నప్పుడు.. కాస్త ఎండలోకి వెళ్లినా సరే ఒంటిమీద కన్నా తలలోంచే చెమటలు వరదలై పారుతుంటాయి. ఇక జేబులోంచి ఖర్చీఫ్ తీసుకుని తుడుచుకోవడం తప్ప దీనికి మరో పరిష్కారం లేదు. కానీ ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుంటే ఈ సమస్యను వెంటనే తగ్గించుకోవచ్చు.
ఈ లోపం కూడా కావచ్చు..
మీ తల ఎక్కువగా చెమట పడుతుంటే అది అన్ని సార్లు అంత డేంజర్ ఏమీ కాదు. కొన్ని సందర్భాల్లో మాత్రం ఇది మీ శరీరం మీకు తెలియజేసే సూచన కావచ్చు. ఎందుకంటే ఎవరికైతే బాడీలో విటమిన్ డి డెఫిషియన్సీ అధికంగా ఉంటుందో వారిలో తలంతా చెమటలతో తడిచిపోతుంటుంది. తల ఎక్కువగా చెమట పట్టడం అనేది విటమిన్ డి లోపంతో సంబంధం ఉన్న మరొక ముఖ్యమైన లక్షణం. ఒకసారి మీ విటమిన్ డి లెవెల్స్ ను చెక్ చేయించుకుంటే సరిపోతుంది. అవసరాన్ని బట్టి నాలుగు వారాల పాటు వైద్యులు సూచించే సప్లిమెంట్స్ తీసుకుంటే ఈ సమస్యకు చెక్ పెట్టినట్లే.
ఇతర కారణాలు..
వేసవిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు కొన్ని చిన్నపాటి పరిష్కారాలతో దీనిని పరిష్కరించవచ్చు. ఈ సమస్య ఉన్నవారు వేసవిలో ప్రతి రోజు తల స్నానం చేయడం చాలా మంచిది. తప్పకుండా ఆర్గినిక్ షాంపులను మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. ప్రతి రోజు ఇలాంటి షాంపూలతో స్నానం చేయడం వల్ల జుట్టులో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అంతేకాకుండా చమట సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి సమ్మర్‌లో ప్రతి రోజు తల స్నానం చేయాలి. రసాయనాలు తక్కువగా ఉన్న షాంపూను ఎంచుకోండి.
ఆపిల్ వెనిగర్..
యాపిల్ వెనిగర్ శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే గుణాలు జుట్టు సమస్యలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం ఒక చెంచా యాపిల్ సైడర్ వెనిగర్‌ను వేడి నీటిలో కలిపి తలకు మసాజ్ చేసి..అలాగే 20 నిమిషాల పాటు ఉంచాల్సి ఉంటుంది. ఆ తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాలి. యాపిల్ సైడర్ వెనిగర్ జుట్టుకే కాదు.. మీ చర్మానికి కూడా మేలు చేస్తుంది.
నిమ్మరసం..
నిమ్మరసంలో కరిగే ఫైబర్ అధిక పరిమాణంలో ఉంటుంది.. కాబట్టి సులభంగా శరీర బరువును నియంత్రిస్తుంది. అయితే ఈ రసాన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు దుర్వాసన రాకుండా ఉంటుంది. దీనిని అప్లై చేయడానికి ముందుగా ఒక నిమ్మకాయను తీసుకోని.. వాటి నుంచి రసం తీసి.. నీటిలో కలపండి.. అందులోనే ఆపిల్ వెనిగర్ వేసి జుట్టుకు అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత జుట్టును శుభ్రం చేసుకోండి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల సమ్మర్‌లో జుట్టు రాలడం సమస్యలు దూరమవుతాయి. జుట్టుకు డైరెక్టుగా నిమ్మరసం మాత్రం అప్లై చేయకండి..