World Covid 19: ప్రపంచ దేశాల్లో కరాళ నృత్యాన్ని కొనసాగిస్తోన్న కోవిడ్, 9 కోట్లకు చేరుకుంటున్న బాధితుల సంఖ్య

చైనా లో పుట్టిన కరోనా వైరస్... ప్రపంచాన్ని చుట్టేస్తోంది. దేశవిదేశాల్లో కోవిడ్ కరాళ నృత్యాన్ని కొనసాగిస్తోంది. మరణ మృదంగాన్ని మోగిస్తోంది. కరోనా ధాటికి పేద, ధనిక దేశం అనే..

World Covid 19: ప్రపంచ దేశాల్లో కరాళ నృత్యాన్ని కొనసాగిస్తోన్న కోవిడ్, 9 కోట్లకు చేరుకుంటున్న బాధితుల సంఖ్య
Follow us

|

Updated on: Jan 08, 2021 | 10:54 AM

World Covid 19: చైనా లో పుట్టిన కరోనా వైరస్… ప్రపంచాన్ని చుట్టేస్తోంది. దేశవిదేశాల్లో కోవిడ్ కరాళ నృత్యాన్ని కొనసాగిస్తోంది. మరణ మృదంగాన్ని మోగిస్తోంది. కరోనా ధాటికి పేద, ధనిక దేశం అనే తేడాలేకుండా కకావికలమౌతుంది. సామాన్యుడు, సెలబ్రెటీ అనే బేధం లేదు.. ఎవరినీ ఈ వైరస్ విడిచి పెట్టడంలేదు. గంటగంటకూ కరోనా పాజిటివ్ కేసులు అత్యంత వేగంగా నమోదవుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడంలో, మరణాలకు అడ్డుకట్ట వేయడంలో అగ్రదేశాలు సైతం చేతులు ఎత్తేశాయి. టీకా కోసం అన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.

తాజాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 8,85,03,066 కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసుల సంఖ్య తొమ్మిది కోట్లకు చేరుకుంటోంది. ఇప్పటి వరకూ ఈ వైరస్ బారిన పడి 19,06,746మంది మరణించారు. 6,36,12,318 మంది ఈ వైరస్ బారినుంచి కోలుకున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా 2,2984,002 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  మరోవైపు అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఆరంభమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరోనా బాధితులు అత్యధికంగా నమోదవుతున్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. భారత్, బ్రెజిల్, రష్యా, యుకె లు వరస స్థానాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా వ్యాప్తంగా ఇప్పటిదాకా3,74,124 మంది మరణించారు. పాజిటివ్ కేసుల సంఖ్య రెండు కోట్లు దాటాయి. అగ్రరాజ్యంలో ఇప్పటి వరకూ2,21,32,045 కరోనా కేసులు నమోదయ్యాయి. బ్రెజిల్‌లో ఇప్పజిల్‌లో ఇప్పటిదాకా 2,00,498 మంది చనిపోయారు. 79,61,673 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రష్యాలో ఇప్పటిదాకా 33,32,142 కేసులు వెలుగులోకి వచ్చాయి. 60,457 మంది మరణించారు. అయితే కరోనా కేసులు నమోదులో భారత్ సెకండ్ ప్లేస్ లో కొనసాగుతుంది. అయితే అదే స్థాయిలో రికవరీ రేటు కూడా ఉంది.

Also Read: టీమిండియా 2021 ఫుల్ షెడ్యూల్.. ఏడాదంతా బిజీబిజీ.. కోహ్లీసేన ముందు ఎన్నో సవాళ్లు..