AP Lawcet 2025 Notification: న్యాయ కోర్సుల్లో ప్రవేశాలకు లా సెట్ 2025 నోటిఫికేషన్ విడుదల.. ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే?
2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి 3 ఏళ్ల LLB, 5 ఏళ్ల LLB, 2 ఏళ్ల LLM పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ లాసెట్, పీజీఎల్‌సెట్-2025 నోటిఫికేషన్‌లను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు మార్చి 25 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు..

ఆంధ్రప్రదేశ్ న్యాయ విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ( ఏపీ లాసెట్, పీజీఎల్‌సెట్-2025) నోటిఫికేషన్ విడుదలైంది. 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి 3 ఏళ్ల LLB, 5 ఏళ్ల LLB, 2 ఏళ్ల LLM పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు మార్చి 25 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 27, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ ఏడాదికి లాసెట్ ప్రవేశ పరీక్షను పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. ఇక జూన్ 05, 2025న రాత పరీక్ష నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి 10.30 గంల వరకు ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్ష నిర్వహిస్తారు.
మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్) కోర్సుల్లో ప్రవేశాలకు 45 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత లేదా డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీలకు 42 శాతం, ఎస్సీ-ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. ఎలాంటి వయోపరిమితి లేదు. ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ (బీఏ ఎల్‌ఎల్‌బీ, బీకామ్ ఎల్‌ఎల్‌బీ, బీబీఏ ఎల్‌ఎల్‌బీ) కోర్సులో ప్రవేశాలకు 45 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఇంటర్ సెకండియర్ చదువుతున్నవారు కూడా అర్హులే. ఓబీసీలకు 42 శాతం, ఎస్సీ-ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. ఎలాంటి వయోపరిమితి లేదు.
ఇక రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సులో ప్రవేశాలకు ఎల్‌ఎల్‌బీ/బీఎల్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. లా డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రశ్నాపత్రం తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు, సిలబస్ తదితర సమాచారం వివరణాత్మక నోటిఫికేసన్ విడుదలైన తర్వాత చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.