ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో 83% మంది నిరుద్యోగులే.. జాబ్ మార్కెట్లో మారుతున్న ప్రాధాన్యతలు!
నియామక ధోరణులపై లోతైన అధ్యయనం చేసి అన్‌స్టాప్ టాలెంట్ రిపోర్ట్ 2025 తాజాగా విడుదలైంది. ఇందులో యేటా దాదాపు 83 శాతం మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, బిజినెస్ స్కూల్ (B-స్కూల్స్) గ్రాడ్యుయేట్లలో 46 శాతం మంది ఎలాంటి ఉద్యోగం పొందడంలేదని వెల్లడించింది. కనీసం ఇంటర్న్‌షిప్ ఛాన్స్ కూడా..

ఇంజనీరింగ్ విద్య రోజురోజుకీ దిగజారుతుంది. యేటా లక్షల్లో చదువుపూర్తి చేసుకుని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు (E-స్కూల్స్) బయటకు వస్తున్నా ఉద్యోగాలు మాత్రం అరకొరగానే లభిస్తున్నాయి. దీనిపై అన్‌స్టాప్ విడుదల చేసిన తాజా నివేదిక ఆందోళన కలిగిస్తుంది. నియామక ధోరణులపై లోతైన అధ్యయనం చేసి అన్‌స్టాప్ టాలెంట్ రిపోర్ట్ 2025 తాజాగా విడుదలైంది. ఇందులో యేటా దాదాపు 83 శాతం మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, బిజినెస్ స్కూల్ (B-స్కూల్స్) గ్రాడ్యుయేట్లలో 46 శాతం మంది ఎలాంటి ఉద్యోగం పొందడంలేదని వెల్లడించింది. కనీసం ఇంటర్న్‌షిప్ ఛాన్స్ కూడా వీరికి దొరకడం లేదని పేరకొంది. 30 వేలకుపైగా మంది GenZ నిపుణులు, 700 మంది HR నాయకుల ప్రతిస్పందనలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదికను రూపొందించారు. ఈ సర్వేలో 72% E-స్కూల్స్, 16% B-స్కూల్స్, 12% ఆర్ట్స్, సైన్స్,కామర్స్ కళాశాలలు పాల్గొన్నాయి. నేటి యువత ఉపాధి సవాళ్లు ఏ మేరకు ఉన్నాయో ఈ నివేదిక వెల్లడిస్తుంది.
అన్‌స్టాప్ టాలెంట్ రిపోర్ట్ 2025లో కీలక అంశాలు ఇవే..
- 83% ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, 46% బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు.
- బి-స్కూల్ విద్యార్థులతో సహా 51%కిపైగా GenZ నిపుణులు ఫ్రీలాన్సింగ్, సైడ్ గిగ్స్ వంటి బహుళ ఆదాయ మార్గాలను కోరుకుంటున్నారు. B-స్కూళ్లలో ఇది 59%కి పెరుగుతుంది.
- ఈ నివేదిక లింగ వేతన అంతరాలను కూడా వెల్లడించింది. ప్రతి ముగ్గురిలో ఇద్దరు మహిళా ఆర్ట్స్ & సైన్స్ గ్రాడ్యుయేట్లకు రూ.6 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం సంపాదిస్తున్నారు. ఇదే రంగాలలోని ప్రతి ముగ్గురిలో ఇద్దరు పురుష గ్రాడ్యుయేట్లు మాత్రం అధిక సంపాదన కలిగి ఉండటం విశేషం. అయితే, B-స్కూల్స్, E-స్కూల్స్ లింగంతో సంబంధం లేకుండా సమాన స్థాయిని వేతనాలు అందిస్తున్నాయి.
- 77% GenZ నిపుణులు తరచుగా పనితీరు సమీక్షలను (నెలవారీ లేదా ప్రాజెక్ట్ ఆధారిత) ఇష్టపడుతున్నారు. అయితే 71% రిక్రూటర్లు ఇప్పటికీ వార్షిక, ద్వివార్షిక మరియు త్రైమాసిక సమీక్షల వంటి సాంప్రదాయ చెక్-ఇన్‌లపై ఆధారపడతారు.
- 70% GenZ కేస్ స్టడీస్, ఐడియాథాన్‌లు, క్విజ్‌లు, సిమ్యులేషన్‌లలో పాల్గొంటారు. కానీ 25% రిక్రూటర్లు మాత్రమే ప్రతిభను గుర్తించడానికి వ్యూహంగా వీటిని వినియోగిస్తున్నారు.
- ప్రీమియర్ కాలేజీ ట్యాగ్‌లు 73% రిక్రూటర్లపై ఎటువంటి ప్రభావాన్ని చూపడం లేదు. వీరు ప్రముఖ సంస్థల డిగ్రీల కంటే నైపుణ్యాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
- 2024లో నలుగురిలో ఒకరికి జీతం లేని ఇంటర్న్‌షిప్‌లు లభించాయి. ఇది 2023లో 8 మందిలో ఒకటి నుంచి 2 రెట్లకు పెరిగింది.
- 25% ఆఫర్లు ఇప్పుడు ఈ-కామర్స్, స్టార్టప్‌లు, ఉత్పత్తితో సహా తదుపరి తరం రంగాల నుంచి వస్తున్నాయి. ఉదాహరణకు జొమాటో, మీషో వంటి నెక్స్ట్-జెన్ కంపెనీలకు ఆదరణ పెరుగుతుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.