Gold Rate Today: ఆల్ టైం రికార్డుకు పుత్తడి పరుగులు.. మీ ఊరిలో నేటి తులం బంగారం ధర ఎంతుందంటే?
పెళ్లిళ్లు, శుభకార్యలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారం. కానీ గత వారం రోజులుగా బంగారం ధరల ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా పరుగులు లంకించుకున్నాయి. రోజురోజుకు రికార్డు స్థాయిలో ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. దేశీయ మార్కెట్‌లో శుక్రవారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పుతూ..

పసిడి ధరలు దడపుట్టిస్తున్నాయి. రోజురోజుకు రికార్డు స్థాయిలో ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. దేశీయ మార్కెట్‌లో గురువారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పుతూ రూ.91 వేలను సమీపించింది. గత వారం రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ రోజు (మార్చి 21) కూడా మరికాస్త ఎగబాకిన పుత్తడి 24 క్యారెట్లు తులం రూ.90,670కి చేరింది (గ్రాము ధర రూ.9,067). 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.83,110 (గ్రాము ధర రూ. 8,311) వద్ద కొనసాగుతుంది. ఇక 18 క్యారెట్ల బంగారం 10 గ్రాములుకు రూ.68,001 (గ్రాము ధర రూ.6,800) ధర పలుకుతుంది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం తులం రూ.90,670, 22 క్యారెట్ల బంగారం తులం రూ.83,110, 18 క్యారెట్ల బంగారం తులం రూ.68,001 చొప్పున ధరలు పలుకుతున్నాయి.
- గుంటూరులో లో 24 క్యారెట్ల బంగారం తులం రూ.90,670, 22 క్యారెట్ల బంగారం తులం రూ.83,110, 18 క్యారెట్ల బంగారం తులం రూ.68,001 చొప్పున ధరలు పలుకుతున్నాయి.
విజయవాడ, ఖమ్మం వంటి ఇతర ప్రధాన నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాతున్నాయి.
దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
- ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం తులం రూ.90,820, 22 క్యారెట్ల బంగారం తులం రూ.83,260, 18 క్యారెట్ల బంగారం తులం రూ.68,120 చొప్పున ధరలు పలుకుతున్నాయి.
- కలకత్తాలో 24 క్యారెట్ల బంగారం తులం రూ.90,670, 22 క్యారెట్ల బంగారం తులం రూ.83,110, 18 క్యారెట్ల బంగారం తులం రూ.68,000 చొప్పున ధరలు పలుకుతున్నాయి.
- బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం తులం రూ.90,670, 22 క్యారెట్ల బంగారం తులం రూ.83,110, 18 క్యారెట్ల బంగారం తులం రూ.68,000 చొప్పున ధరలు పలుకుతున్నాయి.
- కేరళలో 24 క్యారెట్ల బంగారం తులం రూ.90,670, 22 క్యారెట్ల బంగారం తులం రూ.83,110, 18 క్యారెట్ల బంగారం తులం రూ.68,000 చొప్పున ధరలు పలుకుతున్నాయి.
- చెన్నైలో 24 క్యారెట్ల బంగారం తులం రూ.90,670, 22 క్యారెట్ల బంగారం తులం రూ.83,110, 18 క్యారెట్ల బంగారం తులం రూ.68,560 చొప్పున ధరలు పలుకుతున్నాయి.
ఇక వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
బంగారానికి పోటీగా ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్లు వెండి ధరలు కూడా పైపైకి ఎగబాకుతున్నాయి. ఇప్పటికే రూ. లక్ష మార్కు దాటేసిన వెండి ధర తాజాగా మరికాస్త పెరిగింది. వెండి కిలో ధర గురువారం రూ.1,05,100 ఉండగా.. ఈ రోజు రూ.100 ఎగబాకి రూ.1,05,200కి చేరింది. దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
గమనిక: ఇక్కడ ఇచ్చిన బంగారం, వెండి ధరలు జీఎస్టీ, తరుగు కలపకుండా ఇచ్చినవి. వీటి ధరలు కూడా కలిపితే ధరల్లో మార్పులు ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి.