Bank Working Days: ఏప్రిల్ నుండి బ్యాంకులు వారానికి 5 రోజులు మాత్రమే తెరిచి ఉంటాయా?
Bank Working Days: బ్యాంకుల పని దినాలను తగ్గించాలని, వారానికి కేవలం 5 రోజులు మాత్రమే పని చేసేలా ప్రకటించాలని గత కొంత కాలంగా బ్యాంకు ఉద్యోగులు, యూనియన్స్, ప్రభుత్వ అధికారుల మధ్య చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఏప్రిల్ నుంచి బ్యాంకులు వారానికి 5 రోజులు మాత్రమే తెరిచి ఉండనున్నాయా? ఆర్బీఐ చెప్పిందేమిటి?

ఇటీవల ఒక వార్త చాలా చర్చనీయాంశమైంది. ఏప్రిల్ 2025 నుండి భారతదేశం అంతటా బ్యాంకులు 5 రోజులు మాత్రమే తెరిచి ఉంటాయని వార్తలు వస్తున్నాయి. దీని కోసం ఆర్‌బిఐ కొత్త నిబంధనను తీసుకువచ్చిందని మీడియా నివేదికలో తెలిపింది. ఈ నివేదిక అందరి దృష్టిని ఆకర్షించింది. దీని తరువాత వచ్చే నెల నుండి నాలుగు శని, ఆదివారాల్లో బ్యాంకులు మూసివేయబడతాయా లేదా అనే దానిపై చర్చ ప్రారంభమైంది.
అయితే PIB వైరల్ అవుతున్న ఈ వార్తలను తనిఖీ చేసి ఇది పూర్తిగా ఫేక్ అంటూ స్పష్టం చేసింది. పీఐబీ (PIB) ఫ్యాక్ట్ చెక్ ప్రకారం.. ఒక మీడియా సంస్థ నివేదిక ప్రకారం ఏప్రిల్ నుండి ఆర్బీఐ జారీ చేసిన కొత్త నిబంధనను అనుసరించి దేశవ్యాప్తంగా బ్యాంకులు వారానికి 5 రోజులు పనిచేస్తాయనే వార్తల్లో నిజం లేదని PIBFactCheck స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన అధికారిక సమాచారం కోసం, https://rbi.org.in ని సందర్శించాలని సూచించింది.
మీడియా నివేదికలో ఏముంది?
ఆర్‌బిఐ తీసుకున్న నియంత్రణ నిర్ణయం వల్ల బ్యాంకింగ్ వారానికి ఐదు రోజులకే పరిమితం అవుతుందని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. అంటే బ్యాంకులు ఇకపై శనివారాల్లో పనిచేయవు. ఏప్రిల్ 2025 నుండి బ్యాంకులు ప్రభుత్వ కార్యాలయాల మాదిరిగానే షెడ్యూల్‌ను అనుసరిస్తాయని, అక్కడ శని, ఆదివారాలు సెలవు దినాలుగా ఉంటాయని నివేదిక సూచిస్తుంది. దీనిపై స్పందించిన పీఐబీ ఇది ఫేక్ అంటూ వెల్లడించింది.
ఆర్‌బిఐ ఏదైనా అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసిందా?
బ్యాంకులు వారానికి ఐదు రోజుల పని దినాలకు మారుతాయని రిజర్వ్ బ్యాంక్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. నెలలో మొదటి, మూడవ మరియు ఐదవ శనివారాల్లో పనిచేయడం ఇప్పటికీ ప్రస్తుత బ్యాంకింగ్ పని విధానంలో భాగం. అయితే, బ్యాంకులకు వారానికి 5 రోజుల పని దినాలపై రిజర్వ్ బ్యాంక్, ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ (IBA) మధ్య కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. బ్యాంకింగ్ యూనియన్లు వారానికి పని వేళలు తగ్గించాలని వాదిస్తున్నాయి. ఎందుకంటే ఇది ఉద్యోగుల వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాలను సమతుల్యం చేయడం, ప్రపంచ బ్యాంకింగ్ నిబంధనలకు అనుగుణంగా ఉండటం మంచిది.
మార్గదర్శకాలు ఏమిటి?
జాతీయ, ప్రాంతీయ సెలవు దినాలు కాకుండా, ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాల్లో బ్యాంకు శాఖలు మూసి ఉండనున్నాయి. నెలలో మొదటి, మూడవ, ఐదవ శనివారాల్లో బ్యాంకు శాఖలు తెరిచి ఉంటాయి. ఆదివారాలు అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఆర్‌బిఐ ఎటువంటి మార్పును ధృవీకరించనప్పటికీ, వారానికి 5 రోజుల పని దినాల ప్రతిపాదన బ్యాంకింగ్ యూనియన్లు, అధికారుల మధ్య చర్చ జరుగుతుంది. మరి ఈ ఐదు రోజుల పని వేళల చర్చ ఎంత మేరకు సక్సెస్ అవుతాయో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: Spacex Dragon Capsule: సునీతా విలియమ్స్ వచ్చిన స్పేస్ఎక్స్ డ్రాగన్ క్రూలో ఒక్కో సీటు ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి