Summer Drinks: వేసవిలో మిమ్మల్ని కూల్‌గా ఉంచే చల్లని పానియాలు.. ఇవి తాగితే ఆరోగ్యంతోపాటు అందం రెట్టింపు!
మండే ఎండల్లో జనాలు శీతల పానియాలు తాగి కాస్త ఉపశమనం పొందుతుంటారు. అయితే ఆరోగ్యానికి హాని తలపెట్టే రసాయనాలు కలిపిన కూల్ డ్రింక్స్ తాగే బదులు ఈ కింది సహజ పానియాలు తాగారంటే ఆనందంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం. వాటిని ఎలా తయారు చేస్తారంటే..

వేసవి మొదలైంది. ఉదయం పది గంటల నుంచే మండే ఎండలకు మాడు పగులుతుంది. ఎండలు వేడిని భరించలేక జనాలు ఉపశమనం కోసం శీతల పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడానికి రకాల కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. కూల్ డ్రింక్స్ తాగితే వాటిల్లోని రసాయనాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కానీ ఈ కింది పానియాలు తాగితే శరీరాన్ని చల్లబరచడమే కాకుండా సూర్యుని వేడికి గాయపడ్డ చర్మానికి చికిత్స చేస్తుంది. కాబట్టి ఏ శీతల పానీయాలు శరీరాన్ని చల్లబరుస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..
నారింజ – అల్లం జ్యూస్
ప్రకాశవంతమైన చర్మం కోసం నారింజ, అల్లం జ్యూస్ తాగవచ్చు. ఈ పానీయాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని UV కిరణాల నుంచి రక్షిస్తుంది. ఈ అల్లం శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. రక్త ప్రసరణను పెంచుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
పుచ్చకాయ – పుదీనా జ్యూస్
వేసవిలో ప్రతిచోటా లభించే పండ్లలో పుచ్చకాయ ఒకటి. ఇది హైడ్రేటింగ్ మాత్రమే కాకుండా ఇందులో విటమిన్లు ఎ, సి, లైకోపీన్‌లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఈ పండు రసం చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మపు మంట, మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి.
పైనాపిల్ – అల్లం జ్యూస్
పైనాపిల్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇందులో ఉండే బ్రోమెలైన్ అనే ఎంజైమ్ చర్మ నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది. అల్లంలో ఉండే పోషకాలు చర్మాన్ని కాంతివంతం చేస్తాయి.
నిమ్మ – పుదీనా జ్యూస్
సిట్రస్ పండు అయిన నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నిమ్మ, పుదీనా రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మంలో అనేక మార్పులు వస్తాయి. నిమ్మకాయకు ముఖం కాంతిని పెంచే గుణం కూడా ఉంటుంది. పుదీనాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి మొటిమలను తగ్గించి చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తాయి.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.